వియ్యంకుడితో లేచిపోయిన వియ్యింపురాలు..కూతురి మామతో ఎఫైర్ వీడియో
ఖన్నా కుటుంబంలో ఒక మహిళ లేచిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో సంచలనంగా మారింది. కాబోయే అల్లుడితో ఒక మహిళ పారిపోయిన విషయం మరవకముందే అంతకు మించిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన కుమార్తె మామతో అక్రమ సంబంధం పెట్టుకున్న సదరు మహిళ ఓ ఫైన్ మార్నింగ్ అతనితో కలిసి ఇంటినుంచి పారిపోయింది. వెళ్ళుతూ వెళ్ళుతూ ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు కూడా తీసుకొని వెళ్ళిపోయిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన ఇద్దరి కోసం వెతుకుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బుధావన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
బుధావన్ జిల్లాకు చెందిన 47 ఏళ్ల మమతకు నలుగురు పిల్లలు. ఆమె భర్త లారీ డ్రైవర్. పెద్ద కుమార్తెకు మూడేళ్ల క్రితం పెళ్లి చేసింది. అయితే సదరు మహిళ తన కుమార్తె మామతో ప్రేమలో పడింది. మొదట వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. ఆ తర్వాత క్రమంగా కలుసుకోవడం మొదలుపెట్టారు. భర్త ఇంట్లో లేనప్పుడు వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేది. ఇలా భర్త లేనప్పుడు వ్యక్తితో సరసాలాడిన సదరు మహిళ ఏప్రిల్ 11న అతనితో కలిసి వెళ్ళిపోయింది. మహిళ భర్త లారీ డ్రైవర్ కావడంతో నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. దీన్ని ఆసరాగా చేసుకొని అతడి భార్య తన కుమార్తె మామను ఇంటికి పిలిపించుకునేది. ఇప్పుడు ఏకంగా వ్యక్తితో కలిసి తన భార్య ఇంటినుంచి పారిపోయిందని అంతేకాకుండా డబ్బులు, నగదు తీసుకెళ్ళిందని భర్త ఆరోపించాడు. నాన్న ఇంట్లో ఉండేవాడు కాదని తన తల్లి ప్రతి మూడు రోజులకు ఒకసారి అతడిని పిలిపించుకునేదని ఆ మహిళ కుమారుడు ఆరోపించాడు. అయితే వారిద్దరూ బంధువులు కాబట్టి ఎలాంటి అనుమానం రాలేదన్నారు స్థానికులు. ఈ విషయంపై ఫిర్యాదు వచ్చిందని డేటా గంజ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
