ఎండలో తిరుగుతున్నారా .. ఈ జాగ్రత్తలు తప్పని సరి వీడియో
అబ్బా! ఈ ఎండ ఒకటి, ఎండాకాలం వల్ల పెద్ద సమస్య వచ్చిపడింది. ఎండలో తిరగడం వల్ల మీ చర్మం మీద దద్దుర్లు రావడం, కాళ్ళు వాపు వావడం, అలాగే ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి. వాతావరణ మార్పుల కారణంగా వేడిగాలుల తీవ్రత, ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నందున వడదెబ్బ తగిలిన తర్వాత ఆ వ్యక్తిపై ఆ ప్రభావం ఒక్కసారితో పోదని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా దీని ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. ఇవి శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపైన నెగిటివ్ ఎఫెక్ట్ చూపుతుందని చెబుతున్నారు. అందుకే వీటి ప్రభావాలపై ముందు అవగాహనతో ఉండటం ముఖ్యం.
అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు శరీరం ఉష్ణాన్ని వెదజల్లడంతో ఇబ్బంది పడుతుంది. దీనివల్ల తాత్కాలిక సమస్యలు ఏర్పడతాయి. వేడిగాలులు దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలను తీవ్రతరం చేస్తాయి. ఎండాకాలంలో మన బాడీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. వేడిగాలుల నుండి రక్షణ పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. తగినంత నీరు తాగడం, ఎండలో ఎక్కువ సమయం గడపకుండా ఉండడం, తేలికైన దుస్తులను ధరించడం, చల్లని ప్రదేశాలలో ఉండడం వంటివి ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఎండలో తిరగడం వల్ల ఆస్తమా ఇంకా ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. వాతావరణ మార్పులను నియంత్రించడానికి పర్యావరణ సమతుల్యతను కాపాడటం కూడా చాలా ముఖ్యం. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మన శరీరాన్ని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి.
మరిన్ని వీడియోల కోసం :
సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
ఈ ప్రభుత్వ టీచర్ ప్రయత్నం అద్భుతం వీడియో
వియ్యంకుడితో లేచిపోయిన వియ్యింపురాలు..కూతురి మామతో ఎఫైర్ వీడియో
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
