Tirupati by-election: తిరుపతి ఉపఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన బీజేపీ.. మేనిఫెస్టో అంశాలు ఇవే..

Tirupati by-election: తిరుపతి ఉపఎన్నిక కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టో‌ను బీజేపీ, జనసేన నాయకులు ఆదివారం నాడు..

Tirupati by-election: తిరుపతి ఉపఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన బీజేపీ.. మేనిఫెస్టో అంశాలు ఇవే..
Tirupati Bjp
Shiva Prajapati

|

Apr 11, 2021 | 6:43 PM

Tirupati by-election: తిరుపతి ఉపఎన్నిక కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టో‌ను బీజేపీ, జనసేన నాయకులు ఆదివారం నాడు సంయుక్తంగా విడుదల చేశారు. ఈ మేనిఫోస్ట్ విడుదల కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేష్, తిరుపతి ఎంపీ అభ్యర్థి రత్నప్రభ, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సోము వీర్రాజు.. టీటీడీ నిధులను ప్రభుత్వ పరం చేయాలని ప్రయత్నాలు జరిగాయని, టీటీడీ ఆస్తులను వేలం వేయాలని గతంలో ప్రణాళికలు రచించారని ఆరోపించారు. బీజేపీ తిరుపతిని స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దటానికి ప్రయత్నించిందన్నారు. రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీ ఉండకూడదని సోము వీర్రాజు పేర్కొన్నారు.

అనంతరం మాట్లాడిన నాదెండ్ల మనోహర్.. రాయలసీమ ప్రాంత ప్రజలకు గతంలో ఎంతోమంది ఎన్నో హామీలిచ్చారని, ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, జనసేన-బీజేపీ తోనే మార్పు సాధ్యమని ప్రజలకు అర్థమైందని నాదెండ్ల పేర్కొన్నారు. తిరుపతి రూపురేఖలు మార్చే అద్భుతమైన మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే.. మేనిఫెస్టోలోని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మీడియాకు వివరించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.. 1. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలో నుంచి తొలగించేలా తిరుపతి నుంచే ప్రారంభం. 2. టీటీడీ ని ధర్మాచార్యుల పర్యవేక్షణలోకి తీసుకురావటం. 3. తిరుమలలో అన్యమత ప్రచారానికి అడ్డు కట్ట వేయటం. 4. యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేలా తిరుపతిలో శరభయ్య విగ్రహం ఏర్పాటు. 5. మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు. 6. 48 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో భక్త కన్నప్ప పేరు మీద ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు. 7. ప్రతీ ఇంటికి తాగునీటి సరఫరా కోసం ‘జలమే జీవనం’ పథకం. 8. ప్రతీ రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు, రెండు లక్షల రుణ సౌకర్యం. 9. పాల ఉత్పత్తి దారులకు, గొర్రెల పెంపకం దారులకు కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాలు. 10. పులికాట్ సరస్సులో పూడిక తీత పనులు. 11. మత్య్స కారుల మధ్య ఘర్షణలు లేకుండా పులికాట్ సరస్సులో సరిహద్దుల రీ సర్వే. 12. ప్రతీ మండలంలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో పరీక్షా కేంద్రాల ఏర్పాటు. 13. తిరుపతి పార్లమెంట్ పరిధిలో నూతన బోధనాసుపత్రి ఏర్పాటు.

Also read:

మీ పిల్లలు చెక్కర తింటున్నారా ? వారి మెదడుపై ఈ ప్రభావం ఉంటుందట.. అధ్యాయనాల్లో షాకింగ్ విషయాలు..

Hyderabad: రోడ్డు పై గుంత..పోలీసులకు తెచ్చింది తంటా..మానవహక్కుల కమిషన్ నోటీసులతో పరేషాన్!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu