AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లలు చెక్కర తింటున్నారా ? వారి మెదడుపై ఈ ప్రభావం ఉంటుందట.. అధ్యాయనాల్లో షాకింగ్ విషయాలు..

జార్జియా విశ్వవిద్యాలయం జరిపిన ఓ పరిశోధనలో రోజూ చక్కెర తినడం వలన ఆది లెర్నింగ్ పవర్, యవ్వనాన్ని తగ్గిస్తుందని తేలింది. అధిక స్వీట్ డ్రింక్స్ తాగడం

మీ పిల్లలు చెక్కర తింటున్నారా ? వారి మెదడుపై ఈ ప్రభావం ఉంటుందట.. అధ్యాయనాల్లో షాకింగ్ విషయాలు..
High Sugar
Rajitha Chanti
|

Updated on: Apr 11, 2021 | 6:40 PM

Share

జార్జియా విశ్వవిద్యాలయం జరిపిన ఓ పరిశోధనలో రోజూ చక్కెర తినడం వలన ఆది లెర్నింగ్ పవర్, యవ్వనాన్ని తగ్గిస్తుందని తేలింది. అధిక స్వీట్ డ్రింక్స్ తాగడం వలన ఒక వ్యక్తి జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుంది. అలాగే గట్‏లోని బాక్టీరియాలో మార్పులు జరిగడమే కాకుండా.. జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందట. సాధరణంగా మన ఇల్లల్లో ఎక్కువగా చెక్కరను వాడుతుంటారు. ఎక్కువగా చక్కెర తినడం వలన ఉబకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యాయనంలో తేలీంది. ఇక పిల్లలు ఎక్కువగా చెక్కర తినడం వలన వారి జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. అలాగే చక్కెర తినని వారి కంటే ఎక్కువగా తినే వారిలో ఈ జ్ఞాపకశక్తి లోపం కనిపిస్తుందట.

చిన్న వయసులోనే చెక్కెర తినడం వలన పారాబాక్టీరాయిడ్స్ స్థాయిలు పెరుగుతాయని.. అలాగే పారాబాక్టీరాయిడ్స్ స్థాయిలు ఎక్కువగా కావడం వలన అవి మెదడుపై ప్రభావం చూపిస్తుందని యూజీఏ కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ కన్స్యూమర్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎమిలీ నోబెల్ చెప్పారు. చక్కెర ఎక్కువగా జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందని.. అలాగే ఇతర అనారోగ్య సమస్యలను కూడా సృష్టిస్తుందని తేలింది. రోజుకు కనీసం 10 శాతం కంటే తక్కువ కేలరీల షూగర్ మాత్రమే తీసుకోవాలని యూఎస్ వ్యవసాయ శాఖ, ఆరోగ్య మానవ సేవల శాఖ సూచిస్తుంది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‏లో వెలువడిన సమాచారం ప్రకారం 9 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు చెక్కర ఎక్కువగా ఉండే డ్రింక్స్‏లో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. హిప్పోకాంపస్ పలు రకాల అభిజ్ఞాత్మక పనితీరుపై పనిచేసే టీనేజ్ పై అభివృద్ధి చూపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. హిప్పోకాంపల్.. ఫ్రీ మోమరీ ఫంక్షన్ అనేది జంతువుల జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపించదు. చిన్న వయసులోనే చెక్కర వినియోగం వలన వారి హిప్పోకాంపల్, జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుందని నోబెల్ తెలిపారు. అధిక చెక్కర వినియోగం వలన గట్ మైక్రోబయోమ్‏లోని పారాబాక్టీరాయిడ్ల స్థాయికి దారితీసిందని.. జీర్ణశయాంతర ప్రేగులలోని 100 ట్రిలియన్లకు పైగా సూక్ష్మ జీవులు మానవ ఆరోగ్యం, వ్యాధుల పై ప్రభావం చూపిస్తాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యాయనాల ప్రకారం ఈ వివరాలు అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న ముందుగా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.

Also Read: షూగర్ వ్యాధి ఉన్నవారు బెండకాయ తింటే మంచిదేనా ? తాజా అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..