AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ వ్యాధి ఉన్నవారు బెండకాయ తింటే మంచిదేనా ? తాజా అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..

Diabetes: డయాబెటిస్ దీర్ఘకాలంగా చాలా మందిని వేధిస్తున్న ప్రాణాంతక వ్యాధి. దీని వలన క్రమంగా మనిషి తన జీవనంలో అనేక మార్పులు చోటుచేసుకోవడమే

షుగర్ వ్యాధి ఉన్నవారు బెండకాయ తింటే మంచిదేనా ? తాజా అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..
Diabetec
Rajitha Chanti
|

Updated on: Apr 11, 2021 | 7:36 PM

Share

Diabetes: డయాబెటిస్ దీర్ఘకాలంగా చాలా మందిని వేధిస్తున్న ప్రాణాంతక వ్యాధి. దీని వలన క్రమంగా మనిషి తన జీవనంలో అనేక మార్పులు చోటుచేసుకోవడమే కాకుండా.. క్రమంగా డయాబెటిస్ వ్యాథి గ్రస్తుల శరీరాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఓ అధ్యాయనం ప్రకారం ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 463 మిలియన్ల మంది డయాబెటిస్ రోగులున్నారు. ఒక్క దక్షిణాసియా (ఎస్‌ఇఎ)ప్రాంతంలో 88 మిలియన్ల బాధిఉతులుండగా, అందులో 77 మిలియన్ల మంది కేవలం మన దేశం నుంచే ఉన్నారని తేలింది. ఇక ప్రస్తుతం దేశంలో సంభవిస్తున్న మరణాల్లో డయాబెటీస్ వలన 2 శాతం వరకు మరణాలు సంభవిస్తున్నాయి. అంటే దేశంలో ఈ వ్యాధి ఎంత గణనీయంగా పెరుగుతుందో అర్థమవుతుంది. అయితే ఇప్పటివరకు ఈ వ్యాథికి శాశ్వతమైన చికిత్స లేదు. కేవలం నియంత్రణ మాత్రమే ఉంది. అయితే ఈ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మరీ వీరు బెండకాయ తినోచ్చా ? తింటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ డయాబెటిక్, హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని బెండకాయ ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహయపడుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ నియంత్రించడమే కాకుండా.. యాంటీహైపెర్లిపిడెమిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఊబకాయం ఉన్నవారికి డయాబెటిస్ చాలా ప్రమాధకరం. చక్కెర పదార్థాలు, కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం వలన స్థూలకాయం, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. దీంతో డయాబెటిస్ భారిన పడే ప్రమాదం ఉంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా ఊబకాయంగా ఉండడానికి కారణం ఇదే. అందుకే ఊబకాయం లేదా హైపర్లిపిడెమియా పెరిగిన కానీ గ్లూకోజ్ స్థాయికి కారణమవుతుంది. తర్వాత బీటా సెల్ పనితీరు ఆగిపోవడం ఇన్సులిన్ స్రావం తగ్గడం జరుగుతుంది. ఇది కూడా డయాబెటిస్‏కు దారి తీస్తుంది.

బెండకాయ శరీరంలో లిపిడ్ స్థాయిలను తగ్గించడమే కాకుండా.. డయబెటిస్ నియంత్రిస్తుంది. ఇందులో ప్యాంక్రియాటిక్ కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే జన్యుపరమైన కారకాల వలన బీటా సెల్ పనిచేయకపోవడం వంటి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బెండకాయ 20 గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది గ్లూకోజ్ స్థాయిని నెమ్మదిగా పెంచుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి హెవీ షుగర్ లెవల్స్ మూత్రపిండాల నరాలను దెబ్బతీస్తుంది. బెండకాయ గ్లోకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. అలాగే మూత్రపిండాలను కాపాడుతుంది. ఇందులో కరిగే డైటరీ ఫైబర ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ పై కార్ప్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

డయాబెటిస్ నియంత్రణ కోసం బెండకాయను ఎలా ఉపయోగించాలి..

* రాత్రి పడుకునే ముందు రెండు బెండకాయలను కాడలు కట్ చేసి ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత మరునాడు ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యాయనాల ప్రకారం ఈ వివరాలు అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న ముందుగా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.