Health Benefits of Jeera Water: ప్రతిరోజూ జీలకర్ర నీరు తాగితే.. ఈ రోగాలన్నీ మటుమాయమే.. అవేంటంటే..?
Cumin Seeds Water: ఆధునిక జీవితంలో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకుంటున్న ఆహారం.. ఒత్తిడి తదితర కారణాలతో అనారోగ్యానికి గురవుతుంటారు. ఇలాంటి
Updated on: Apr 11, 2021 | 1:19 PM

Health Benefits Of Cumin Seeds Water: ఆధునిక జీవితంలో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకుంటున్న ఆహారం.. ఒత్తిడి తదితర కారణాలతో అనారోగ్యానికి గురవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఆరోగ్యవంతంగా ఉండొచ్చంటున్నారు వైద్య నిపుణులు. వంటగదిలో ఉన్న వస్తువులతో గట్టెక్కవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వాటిలో జీలకర్ర ఒకటి.

జీలకర్ర వంటలకు మాత్రమే కాదు.. ఆరోగ్యం మెరుగుపడేలా కూడా సాయం చేస్తుంది. అయితే అలాంటి జీలకర్రను నీటిలో నానబెట్టి లేదా.. మరిగించి తాగితే.. ఆరోగ్యవంతంగా ఉండొచ్చంటున్నారు వైద్య నిపుణులు. జీలకర్ర నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం.

జీలకర్రలో శరీరంలోని కొవ్వును కరిగించే గుణం ఉంది. కావున జీలకర్ర నీటిని ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలోని కొవ్వును సులువుగా తగ్గించుకోవచ్చు. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నా దూరం అవుతుంది. శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి.

తరచూ ఒత్తిడికి గురయ్యే వారు.. జీలకర్రని నీటిలో మరిగించి అందులో కొంచెం నిమ్మరసం, తేనె కలిపి టీలా తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా సులువుగా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా జీలకర్ర నీటిని తాగేతే మంచిది. ప్రతిరోజూ ఈ నీటిని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి.

రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది. దీంతో రక్త సరఫరా మెరుగుపడి గుండె సమస్యలు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.





























