Weight Loss: బరువు తగ్గాలంటే జిమ్‌లకు వెళ్లీ కుస్తి చేయాలా..? ఇలా కూడా అధిక బరువు తగొచ్చు.. ఓసారి ఇవి పాటించండి..
Weight Loss: ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక బరువు ఒకటి. మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు వెరసి చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు...
Weight Loss: ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక బరువు ఒకటి. మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు వెరసి చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా శారీరక శ్రమ తగ్గడం, మానసిక శ్రమ పెరగడంతో ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారు దీంతో చిన్నారులు నుంచి పెద్దల వరకు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే బరువు తగ్గించుకోవడానికి మనకు తెలిసిన మార్గం.. జిమ్‌లలో కుస్తీ చేయడమే. మరి ఇది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రత్యేకంగా జిమ్ కోసం కేటాయించే సమయం కూడా ఉండకపోవచ్చు. అయితే ఇవేవీ కాకుండా రోజువారీ మన దిన చర్యలో భాగంగా చేసే పనులతో అధిక బరువును తగ్గించుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? అవేంటో ఓ సారి చూసేయండి.. * అధిక బరువుకు ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడం కాబట్టి బరువు తగ్గించుకోవాలనుకునే వారు నాలుగు అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ దానికి కారు, బండిపై ఆధారపడకుండా నడిచే వెళ్లే అవకాశం ఉంటే నడకకే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు.
* ఇక ఇటీవల ఆన్‌లైన్ షాపింగ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. కనీసం షాపింగ్ కోసం మాల్స్‌కు వెళ్లే అవకాశం కూడా ఉండట్లేదు. బరువు తగ్గాలనుకుంటే ఇప్పటి నుంచైనా ఆన్‌లైన్ షాపింగ్ మానేసి ఎంచక్కా దగ్గర్లో మాల్‌కు వెళ్లండి. కొనుగోలు చేయకపోయినా మాల్ అంతా తిరిగేసి రండి. ఇది మీలో మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు ఫిట్‌గాను ఉంచుతుంది.
* మీ శరీరంలో వేగంగా క్యాలరీలు తగ్గాలనుకుంటున్నారా.? అయితే మీ ఇంటిని మీరే శుభ్రం చేసుకోండి. 25 నిమిషాల పాటు ఇంటిని శుభ్రం చేసుకుంటే 100 క్యాలరీలను తగ్గించుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఈ విధానాన్ని అలాగే కొనసాగిస్తే అధిక బరువు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
* ఇంట్లోనే ఉంటూ తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గించుకునే మరో మార్గం.. డ్యాన్స్ చేయడం. అవును డ్యాన్స్ చేయడం ద్వారా వేగంగా క్యాలరీలు ఖర్చు అవుతాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఎరొబిక్ సెంటర్లలో డ్యాన్స్‌లు చేపిస్తుండడానికి కారణం ఇదే.
* ఈ మధ్య కాలంలో అన్నం తిని ఇటు కంచాన్ని పక్కన పెట్టగానే అటు బెడ్ ఎక్కేస్తున్నారు. కానీ భోజనం చేసిన తర్వాత కచ్చితంగా కొద్ది సేపు నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణమవడంతో పాటు 100 క్యాలరీలు ఖర్చు అవుతాయి.
Also Read: Health Benefits of Jeera Water: ప్రతిరోజూ జీలకర్ర నీరు తాగితే.. ఈ రోగాలన్నీ మటుమాయమే.. అవేంటంటే..?
Symptoms of coronavirus: వాసన రాకపోవడం, రుచి తెలియకపోవడమే కాదు.. ఇవీ కూడా కరోనా వ్యాధి లక్షణాలే..
గొంతు నొప్పితో ఇబ్బందా..? అయితే ఇలా చేయండి.. వెంటనే ఉపశమనం దొరుకుతుంది..