గొంతు నొప్పితో ఇబ్బందా..? అయితే ఇలా చేయండి.. వెంటనే ఉపశమనం దొరుకుతుంది..
Sore Throat Tips : కొంతమంది తరచూ గొంతునొప్పితో బాధపడుతూ ఉంటారు. సీజన్ మారినప్పుడల్లా ఈ ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. దీంతో వారికి ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి
Sore Throat Tips : కొంతమంది తరచూ గొంతునొప్పితో బాధపడుతూ ఉంటారు. సీజన్ మారినప్పుడల్లా ఈ ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. దీంతో వారికి ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు ఇంట్లో లభించే సహజ పదార్థాలతో వ్యాధిని నయం చేసుకోవచ్చు. గొంతనొప్పికి చక్కటి చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వంటి పదార్థాలను వేసి టీ తయారు చేసుకుని వేడి వేడిగా తాగాలి. ఈ మసాలా టీతో గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. 2.ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్కలను వేయాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో చిక్కని అల్లం రసం వస్తుంది. అప్పుడు ఆ రసాన్ని వడకట్టి వేడిగా ఉండగానే తాగాలి. దీంతో గొంతు నొప్పి క్షణాల్లో తగ్గుతుంది. 3.గొంతు నొప్పి, ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉంటే వేడి వేడిగా చికెన్ సూప్ తాగాలి. ఆయా సమస్యలకు చికెన్ సూప్ ఔషధంగా పనిచేస్తుంది. 4.మిరియాలతో చేసిన చారు, లేదంటే మిరియాలు వేసి మరిగించిన పాలను తాగుతుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా మాయమవుతాయి. 5.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనెలను కలుపుకుని తాగాలి. వీటిలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. ఇన్‌ఫెక్షన్‌లను పోగొడతాయి. జలుబు కూడా తగ్గుతుంది.