కొటక్‌ మహీంద్రా బంపర్‌ ఆఫర్..! ఖాతాదారులకు మరోసారి అవకాశం.. ఏంటో తెలుసుకోండి..

Kotak Mahindra Bank : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ఏదైనా చెల్లింపు యాప్‌ను ఉపయోగించి మిస్సయిన ఈఎంఐ లేదా రుణ వాయిదాలను చెల్లించే అవకాశాన్ని కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కల్పిస్తోంది.

  • uppula Raju
  • Publish Date - 5:38 am, Sun, 11 April 21
కొటక్‌ మహీంద్రా బంపర్‌ ఆఫర్..! ఖాతాదారులకు మరోసారి అవకాశం.. ఏంటో తెలుసుకోండి..
Kotak Mahindra Bank

Kotak Mahindra Bank : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ఏదైనా చెల్లింపు యాప్‌ను ఉపయోగించి మిస్సయిన ఈఎంఐ లేదా రుణ వాయిదాలను చెల్లించే అవకాశాన్ని కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కల్పిస్తోంది. బిల్‌ చెల్లించడానికి వినియోగదారులు తమకు నచ్చిన చెల్లింపు సంస్థ ద్వారా “కోటక్ మహీంద్రా బ్యాంక్ లోన్” ను ఎన్నుకోవాలి. ఇందులో గడువు తేదీ దాటిన ఈఎంఐ వివరాలు కనిపిస్తాయి. వాటిని గమనించి ఫైన్‌ లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు. వ్యక్తిగత రుణాలు, గృహ రుణం, వినియోగదారుల మన్నికైన రుణం, వ్యాపార రుణం, బంగారు రుణం, వాణిజ్య వాహన రుణం, ట్రాక్టర్ ఫైనాన్స్ లోన్, నిర్మాణ సామగ్రి loan వంటి అన్ని రుణాలను చెల్లించుకునే అవకాశం అందించింది. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కస్టమర్ ఇష్టపడే చెల్లింపు సంస్థకు లాగిన్ అవుతారు
2. ‘కోటక్ మహీంద్రా బ్యాంక్ లోన్’ ను బిల్లర్‌గా ఎంచుకోవాలి
3. కోటక్ లోన్ ఖాతా నంబర్‌ను నమోదు చేయాలి.మిస్పయిన EMI వివరాలు ప్రదర్శించబడతాయి.
4. కస్టమర్ అతను చెల్లించదలిచిన మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి
5. చెల్లించిన మొత్తం రియల్ టైమ్ ప్రాతిపదికన కస్టమర్ రుణ ఖాతాకు సర్దుబాటు చేయబడుతుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ కన్స్యూమర్ అధ్యక్షుడు అంబూజ్ చంద్నా మాట్లాడుతూ.. “చెల్లింపుల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొటక్ కస్టమర్లు ఇప్పుడు తమకు నచ్చిన చెల్లింపు సంస్థలైన గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎంల ద్వారా మిస్సయిన రుణ వాయిదాలను చెల్లించవచ్చు. సమయానికి కట్టాల్సిన EMI లు తప్పిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. కోటక్ కస్టమర్లు ఇప్పుడు రెండు క్లిక్‌లలో EMI చెల్లించవచ్చు. మా వినియోగదారులకు రుణాలు చెల్లించడం సులభతరం చేయడమే అంతిమ లక్ష్యం ” అన్నారు.

Dead Whale : బంగ్లాదేశ్ సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చిన 35 అడుగుల చనిపోయిన తిమింగలం

చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ.. శిఖర్‌ ధావన్‌ దాడికి చతికిలపడిన సీఎస్‌కే బౌలర్లు.. రాణించిన పృథ్వీ షా..

ఆసియా క్వాలిఫయర్స్​లో అదరగొట్టిన భారత మహిళా రెజ్లర్లు.. టోక్యో ఒలింపిక్స్‌లో బెర్తులు ఖరారు