AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank holidays April 2021: బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవు.. ఎప్పటినుంచి.. ఎప్పటివరకంటే..?

Indian Bank holidays 2021: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా.. మీరు నిత్యం బ్యాంకు లావాదేవీలు జరుపుతుంటారా.. అయితే మీరు

Bank holidays April 2021: బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవు.. ఎప్పటినుంచి.. ఎప్పటివరకంటే..?
Bank Holidays
Shaik Madar Saheb
|

Updated on: Apr 11, 2021 | 9:46 AM

Share

Indian Bank holidays 2021: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా.. మీరు నిత్యం బ్యాంకు లావాదేవీలు జరుపుతుంటారా.. అయితే మీరు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. వచ్చే వారం వరుసగా కొన్ని రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. అయితే సోమవారం ఒక్కరోజే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 16 వరకు బ్యాంకులు 6 రోజులు పనిచేయవు. ఒక్కరోజు.. అది కూడా సోమవారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. కావున బ్యాంకు లావాదేవీలు చేయాల్సి ఉంటే సోమవారం నిర్వహించుకోవడం ఉత్తమం.

ఏప్రిల్ 10, 11న శనివారం, ఆదివారం సాధారణ సెలవు.. ఏప్రిల్ 12 బ్యాంకులు పనిచేస్తాయి. ఏప్రిల్ 13న ఉగాది పర్వదినం. ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి. ఏప్రిల్ 15న హిమచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ డే. ఏప్రిల్ 16న కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.

కావున ఖాతాదారులు, ఉద్యోగులు సెలవులకనుగుణంగా ప్రణాళికలు చేసుకుంటే.. మంచిదని పలువురు సూచిస్తున్నారు. వరుస సెలవులతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతోపాటు ఏప్రిల్ 21న శ్రీరామ నవమి కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

Also Read: