AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Deposits: డిపాజిట్లతో కళ కళలాడుతున్న బ్యాంకులు.. గతేడాది కంటే 11 శాతం అధికం..ప్రభుత్వ బ్యాంకులతో ప్రయివేట్ బ్యాంకుల పోటీ!

ఇటీవల కాలంలో బ్యాంకుల్లో డిపాజిట్లు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం మన దేశంలో బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్ల మొత్తం ఎంతో తెలుసా?

Bank Deposits: డిపాజిట్లతో కళ కళలాడుతున్న బ్యాంకులు.. గతేడాది కంటే 11 శాతం అధికం..ప్రభుత్వ బ్యాంకులతో ప్రయివేట్ బ్యాంకుల పోటీ!
Bank Deposits
KVD Varma
| Edited By: Ram Naramaneni|

Updated on: Apr 11, 2021 | 1:03 PM

Share

Bank Deposits: ఇటీవల కాలంలో బ్యాంకుల్లో డిపాజిట్లు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం మన దేశంలో బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్ల మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా 150 లక్షల కోట్ల రూపాయలు. గతేడాది ఇదే సమయానికి ఉన్న డిపాజిట్ల మొత్తం కంటే ఇది 11 శాతం ఎక్కువ. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ సంవత్సరంలో బ్యాంకులకు డిపాజిట్లు ఎలా ప్రవాహంలా వచ్చిపడ్డాయనేది. ఇలా అనూహ్యంగా డిపాజిట్లు పెరగటం పై బ్యాంకు వర్గాలు హాశం వ్యక్తం చేస్తూనే.. ఆశ్చర్యానికి గురవుతున్నారు. డిపాజిట్ల పెరుగుదల ఇంతలా ఉండటానికి కారణాలు ఏమిటనేదానిపై వారు ఇలా విశ్లేషిస్తున్నారు.

  • ప్రజలముందు ఆసక్తికరమైన పెట్టుబడి అవకాశాలు లేకపోవడం ఒక కారణంగా చెబుతున్నారు. ప్రస్తుత వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తే పెద్దగా ప్రతిఫలం లేకపోయినా మరో దారిలేక బ్యాంకుల వైపు ప్రజలు చూస్తున్నారు.
  • కరోనా ముప్పుతో ప్రజలు రిస్క్ చేయడానికి ఇష్టపడటం లేదు. అందుకే రిస్క్ అనిపించే పెట్టుబడులను తగ్గించుకుని డిపాజిట్ల పై దృష్టి పెట్టారు. అందుకే డిపాజిట్లు ఒక్కసారిగా ఇంత పెరిగిపోయాయి.
  • మ్యూచువల్ ఫండ్ల నుంచి, కొంతవరకూ ఈక్విటీ షేర్ల నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అలా ఉపసంహరించుకున్న సొమ్ము మొత్తం బ్యాంకులకు వచ్చి చేరింది.
  • ఈమధ్య కాలంలో బ్యాంకు డిపాజిట్లపై వడ్డీరేటు బాగా తగ్గింది. ఒక ఏడాది బ్యాంకులో డిపాజిట్ చేస్తే 5 నుంచి 5. 5 శాతం మాత్రమే వడ్డీ వస్తుంది. అయినా, ప్రజలు బ్యాంకు డిపాజిట్లకు మొగ్గు చూపడం గమనార్హం.

డిపాజిట్ల సేకరణలో ప్రభుత్వ బ్యాంకులతో ప్రయివేటు బ్యాంకులు పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. హెచ్ డీ ఎఫ్ సి , ఫెడరల్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకులు డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధి చూపించాయి. హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు వద్ద 16. 3 శాతం, ఫెడరల్ బ్యాంకులో 13 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకుకు 27 శాతం డిపాజిట్లు పెరిగాయి.

Also Read: Bank holidays April 2021: బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవు.. ఎప్పటినుంచి.. ఎప్పటివరకంటే..?

ఐదువేలతో అదిరిపోయే బిజినెస్‌..! ఇంట్లో నుంచే పని చేయండి.. లక్షలు సంపాదించండి.. ఎలాగో ఓ లుక్కేయండి..