AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదువేలతో అదిరిపోయే బిజినెస్‌..! ఇంట్లో నుంచే పని చేయండి.. లక్షలు సంపాదించండి.. ఎలాగో ఓ లుక్కేయండి..

Start Business Five Thousand : ఈ రోజుల్లో ఉద్యోగాలు చేయడం అంత సులభం కాదు. ప్రభుత్వమైనా, ప్రైవేటైనా ప్రతి రంగంలో పని ఒత్తిడి పెరిగింది కానీ బదులుగా జీతంలో పెరుగుదల లేదు. మీ కలలను

ఐదువేలతో అదిరిపోయే బిజినెస్‌..! ఇంట్లో నుంచే పని చేయండి.. లక్షలు సంపాదించండి.. ఎలాగో ఓ లుక్కేయండి..
Design
uppula Raju
|

Updated on: Apr 11, 2021 | 5:35 AM

Share

Start Business Five Thousand : ఈ రోజుల్లో ఉద్యోగాలు చేయడం అంత సులభం కాదు. ప్రభుత్వమైనా, ప్రైవేటైనా ప్రతి రంగంలో పని ఒత్తిడి పెరిగింది కానీ బదులుగా జీతంలో పెరుగుదల లేదు. మీ కలలను నెరవేర్చుకోవడానికి వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంటే ఈ విషయం తెలుసుకోండి. చాలా కంపెనీలు తమ ప్రకటనను సిద్ధం చేయడానికి డిజిటల్ హోర్డింగ్‌లు, బ్యానర్‌లను తయారు చేస్తాయి. మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే మీరు ఈ పని చేయవచ్చు.

ఈ వ్యాపారం డిజిటల్ హోర్డింగ్‌లు చేయడం. మీరు ఇంటి నుంచి ఈ పనిని ప్రారంభించవచ్చు. మంచి విషయం ఏమిటంటే దీనికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే స్థలం సమస్య కూడా ఉండదు. ఎందుకంటే మీరు దీన్ని గదిలో కూడా ప్రారంభించవచ్చు. కరోనా కాలం నుంచి ఆన్‌లైన్ వ్యాపార ఆలోచనలు వేగంగా పెరుగుతున్నాయి, ఈ సందర్భంలో ఈ ఎంపిక మీకు ఉపయోగపడుతుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి.

మీకు గ్రాఫిక్స్, డిజైనింగ్, కంప్యూటర్ల గురించి మంచి జ్ఞానం ఉంటే మీరు ఇంటి నుంచి డిజిటల్ హోర్డింగ్లను తయారుచేసే పనిని చేయవచ్చు. ప్రారంభ దశలో ఫ్రీలాన్సింగ్ డాట్ వర్క్ లేదా అప్‌వర్క్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో అనేక విభిన్న సైట్‌లలో మీ నైపుణ్యాలను చెప్పడం ద్వారా మీరు ఆర్డర్లు తీసుకోవచ్చు. దీని కోసం మీరు ఈ పోర్టల్‌లలో పేరు నమోదు చేసుకోవాలి. అయితే రిజిస్ట్రేషన్‌కు ముందు, వారి విశ్వసనీయతను నిర్ధారించుకోండి. మీకు కావాలంటే మీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా ట్విట్టర్‌లో కూడా డిజిటల్ హోర్డింగ్‌లు చేయడం గురించి సమాచారం అందించడం ద్వారా మీరు ప్రజల నుంచి ఆన్‌లైన్ ఆర్డర్లు పొందవచ్చు.

మీకు కావాలంటే సొంత వెబ్‌సైట్‌ను తయారు చేసుకోండి. దీని కోసం మీరు గో డాడీ లేదా ఇతర సైట్ల నుంచి డోనమ్ కొనుగోలు చేస్తారు. దీని ధర 1000 కన్నా తక్కువ. దీని తరువాత సంవత్సరం హోస్టింగ్ తీసుకోండి. దీనికి రెండున్నర నుంచి మూడు వేల వరకు ఖర్చు అవుతుంది. మీరు మీ వెబ్‌సైట్‌ను డాట్ కామ్ ద్వారా సృష్టిస్తే దీనికి కొంచెం ఎక్కువ ఖర్చవుతుంది. అయినప్పటికీ మీ పని 5 వేలు లేదా అంతకంటే తక్కువలో పూర్తవుతుంది. అదే సమయంలో డాట్-ఇన్ ఖర్చు తగ్గుతుంది.

వెబ్‌సైట్ సిద్ధమైన తర్వాత మీరు దాన్ని ప్రచారం చేయవచ్చు. ఇది కంపెనీలు, వ్యక్తులకు మీ పరిధిని పెంచుతుంది. హోర్డింగ్‌లు చేయడానికి వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు డిజిటల్ ఆకృతిలో తయారు చేయడం ద్వారా ప్రారంభ దశలో సంపాదిస్తారు. తరువాత మీరు వ్యాపారం విస్తరణ కోసం ముద్రుణ కూడా ప్రారంభించవచ్చు. చిన్న బ్యానర్‌ల కోసం మీకు ఖరీదైన ప్రింటర్ అవసరం లేదు కానీ మీరు ఈ వ్యాపారాన్ని చాలా పెద్ద స్థాయిలో చేయాలనుకుంటే మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే అప్పుడు మీకు పెద్ద ప్రింటర్ అవసరం అవుతుంది కనుక.

Warangal Rural: వరంగల్‌లో హడలెత్తిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. రంగంలోకి దిగిన వైద్యులు.. చివరికి ఏం తేలిందంటే..

ఆసియా క్వాలిఫయర్స్​లో అదరగొట్టిన భారత మహిళా రెజ్లర్లు.. టోక్యో ఒలింపిక్స్‌లో బెర్తులు ఖరారు