AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal Rural: వరంగల్‌లో హడలెత్తిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. రంగంలోకి దిగిన వైద్యులు.. చివరికి ఏం తేలిందంటే..

Warangal Rural District: వరంగల్ రూరల్ జిల్లాలో అంతుచిక్కని వింతవ్యాధి పాడి రైతులను హడలెత్తిస్తోంది. పశువుల ప్రాణాలు మింగేస్తుంది.

Warangal Rural: వరంగల్‌లో హడలెత్తిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. రంగంలోకి దిగిన వైద్యులు.. చివరికి ఏం తేలిందంటే..
Cattles
Shiva Prajapati
|

Updated on: Apr 10, 2021 | 11:18 PM

Share

Warangal Rural District: వరంగల్ రూరల్ జిల్లాలో అంతుచిక్కని వింతవ్యాధి పాడి రైతులను హడలెత్తిస్తోంది. పశువుల ప్రాణాలు మింగేస్తుంది. గేదేలు, దుక్కిటేద్దులను బలి తీసుకుంటుంది. గడిచిన 15 రోజుల వ్యవధిలో రెండు దుక్కిటేద్దులు, 20 గేదెలు మృతి చెందాయి. వాటికి ఎదో వింతవ్యాధి సోకివుంటుందని గ్రామస్తులు ఆందోళన చెందుతుంటే. రేబీస్ వ్యాధి వల్లే మరణాలు సంభవిస్తున్నాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.

వివరాల్లోకెళితే.. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపెల్లి గ్రామంలో పశువులు ఉన్నట్లుండి చనిపోతున్నాయి. ఇప్పటి వరకు 22 పశువులు చనిపోగా, వాటిలో పంట చేనులో నాలుగు పశువులు మృతి చెందాయి. అప్పటివరకు కళ్ళముందు ఆరోగ్యంగా ఉన్న గేదేలు ఒక్కసారిగా మృతి చెందడంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మాయదారి బర్డ్ ఫ్లూ సోకిందోమోనన్న అనుమాన్ని జనాలు వ్యక్తం చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న వైద్య నిపుణులు రంగంలోకి దిగారు. సూరిపెల్లి గ్రామంలో పర్యటించి పశువులను పరిశీలించారు. మృతి చెందిన పశువుల మెదడును పరీక్షల నిమిత్తం ముంబై ల్యాబ్‌కి పంపించారు. దీనికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. అయితే, రేబీస్ వ్యాధి కారణంగానే పశువులు మృతి చెందాయని వెటర్నరీ డాక్టర్‌ మమతా చెబుతున్నారు. పశువులకు ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తపడాలనీ హెచ్చరిస్తున్నారు. దీనికీ మందు లేదని, అజాగ్రత్త వహిస్తే మనుషులకు కూడ సోకుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఆ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించామన్న ఆమె.. మళ్ళీ మరో హెల్త్ క్యాంప్ ను కూడ నిర్వహిస్తామని తెలిపారు. రైతులకు కూడా యాంటీ రాబీస్ వ్యాక్సిన్ ఇచ్చామని ఆమె తెలిపారు.

Also read:

Telangana Corona : తెలంగాణకు కోవిడ్ 19 వ్యాక్సిన్ డోసులు అర్జెంటుగా పంపించండి.. కేంద్రమంత్రికి చీఫ్ సెక్రటరీ లేఖ

IPL 2021 Disney+ Hotstar: అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడండి.. ఈ సంస్థ చౌకైన హాట్‌స్టార్ ప్లాన్‌ను అందిస్తుంది..

Congress vs BJP: నాగార్జునసాగర్‌లో ఆసక్తికర పరిణామం.. ఎదురెదురుగా కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. కార్యకర్తలు ఏం చేశారంటే..