Congress vs BJP: నాగార్జునసాగర్‌లో ఆసక్తికర పరిణామం.. ఎదురెదురుగా కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. కార్యకర్తలు ఏం చేశారంటే..
Congress vs BJP: నాగార్జున సాగర్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. ఇంతకాలం స్తబ్ధుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం..
Nagarjuna Sagar By Election: నాగార్జున సాగర్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. ఇంతకాలం స్తబ్ధుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం.. క్రమంగా హోరెత్తుతోంది. కీలక నేతలంతా ఒక్కొక్కరుగా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహా, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ తరఫున నేతలు ఒక్కొక్కరు ప్రచార పర్వంలోకి అడుగుపెడుతున్నారు. ఇక బీజేపీ నేతలు సైతం సాగర్ ఉపఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క కీలక నేత కూడా సాగర్ వైపు చూసిన దాఖలాలు లేవు. క్షేత్రస్థాయి నేతలు తప్ప.. ముఖ్యమైన నాయకులెవరూ ప్రచారానికి రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి సాగర్ ఎన్నికల కదనరంగంలోకి అడుగుపెట్టారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు.
శనివారం నాడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్ర బీజేపీ నేత కిషన్ రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఇద్దరి రాకతో సాగర్ గడ్డపై బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. పోటాపోటీ షోలు నిర్వహించారు. అయితే, ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి ఎదురెదురు తారసపడ్డారు. దాంతో ఇరు పార్టీల శ్రేణులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. జై భారత్ మాతా అంటూ బీజేపీ కార్యకర్తలు నినదిస్తే.. జై కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదలు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో నాగార్జున సాగర్‌లో హీట్ పెరిగింది.
Election Campaign Video:
Vijayawada Lockdown: విజయవాడలో మళ్లీ లాక్‌డౌన్ అంటూ ప్రచారం… క్లారిటీ ఇచ్చేసిన కలెక్టర్ ఇంతియాజ్