Corona vaccine : శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ కష్టాలు, ప్రజల్లో ఉత్సుకత నెలకొన్న సమయంలో కొత్త ఇబ్బందులు
Covid vaccine : కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్న ఉత్సుకత ప్రజల్లో నెలకొన్న ఈ సమయంలో కరోనా వ్యా..
Covid vaccine : కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్న ఉత్సుకత ప్రజల్లో నెలకొన్న ఈ సమయంలో కరోనా వ్యాక్సిన్ కొరత శ్రీకాకుళం జిల్లా వాసులను వెంటాడుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జిల్లాకు 2,20,200 కోవిషీర్డ్, కోవ్యాగ్జిన్ డోసులు సరఫరా అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ వ్యాక్సిన్ లను వేస్తున్నారు. అయితే ఆ నిబంధనలను సడలించి 45 సంవత్సరాల వయసు పై బడిన వారు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని ఆదేశించడంతో పెద్ద మొత్తంలో ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావడంతో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. సిక్కోలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ చాలా మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. మరో వైపు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవాలు జరుపుకునేందుకు సిద్ధమౌతోంది సర్కారు. ఈ నేపథ్యంలో జిల్లాలో తలెత్తిన కోవిడ్ టీకా కొరతను ఎలా అధికమిస్తారో అనే ప్రశ్న తలెత్తుతుంది.
అయితే, కేంద్రం మాత్రం కరోనా వ్యాక్సిన్ కొరత ప్రసక్తే లేదంటోంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఉందంటూ వస్తోన్న ఊహాగానాలపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటి వరకూ 9కోట్ల 43లక్షలకు పైగా డోసులు ఇచ్చినట్లు ప్రకటించారు. గత 24 గంటల్లో 37లక్షలకు చేరువలో డోసులిచ్చినట్లు వెల్లడించారు. ఐతే గత వారం ఒక్కరోజులోనే 43లక్షలకు పైగా డోసులు వేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌లో మనమే ముందున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ల కొరత లేనే లేదని తేల్చిచెప్పారు. మృతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోందని ప్రకటించారు.