Covid Lockdown: కరోనా టెర్రర్‌ అదుపుకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం.. కుండబద్దలు కొట్టిన ముఖ్యమంత్రి..

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ మళ్లీ తప్పడం లేదు. అయితే 8 రోజుల లాక్‌డౌన్‌ ఉంటుందా ? లేక 14 రోజులు సర్వం బంద్‌ చేస్తారా ? అన్న విషయంపై సస్పెన్స్‌ నెలకొంది. కరోనా చైన్‌ను తెంపాలంటే లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారమని అఖిలపక్ష భేటీలో స్పష్టం చేశారు సీఎం ఉద్దవ్‌ థాక్రే.

Covid Lockdown: కరోనా టెర్రర్‌ అదుపుకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం.. కుండబద్దలు కొట్టిన ముఖ్యమంత్రి..
Uddhav Thackeray
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 10, 2021 | 10:00 PM

Maharashtra CM Uddhav Thackeray hints: కరోనా టెర్రర్‌ అదుపుకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌థాక్రే తేల్చి చెప్పారు. సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించే విషయంపై ఆయన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ,ఎన్సీపీ , కాంగ్రెస్‌, ఎంఎన్‌ఎస్‌తోపాటు రాష్ట్రంలోని ముఖ్య పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. లాక్‌డౌన్‌ విధిస్తే నెల రోజుల్లో కరోనా అదుపు లోకి వస్తుందన్నారు సీఎం ఉద్దవ్‌. ఈనెల 15 నుంచి 20వ తేదీ మధ్య కరోనా మహమ్మారి మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరుగుతున్నప్పటికి రాష్ట్రంలో కరోనా అదుపు లోకి రావడం లేదన్నారు. అందుకే మినీ లాక్‌డౌన్‌ విధించడం తప్ప వేరే మార్గం లేదన్నారు. మహారాష్ట్రలో 8 నుంచి 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయని ఉద్దవ్‌ అఖిలపక్ష భేటీలో వెల్లడించారు. రెండు రోజుల్లో లాక్‌డౌన్‌పై నిర్ణయం ప్రకటిస్తామన్నారు ఉద్దవ్‌. ఆదివారం మహారాష్ట్ర కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎన్నిరోజులు లాక్‌డౌన్‌ విధించాలన్న విఫయంపై నిర్ణయం తీసుకుంటారు. అయితే అఖిలపక్ష భేటీలో లాక్‌డౌన్‌పై ఏకాభిప్రాయం కుదరలేదు.

సంపూర్ణ లాక్‌డౌన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌. బలవంతంగా లాక్‌డౌన్‌ విధిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశముందని హెచ్చరించారు ఫడ్నవీస్‌. కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలు విధించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే నైట్‌కర్ఫ్యూ అమల్లో ఉంది.

లాక్‌డైన్‌ భయంతో ఇప్పటికే వేలాదిమంది వలసకార్మికులు ముంబై నుంచి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. మహారాష్ట్రలో వ్యాక్సిన్‌ కొరత రోజురోజుకు పెరుగుతోంది. వ్యాక్సిన్‌ సెంట్లర్ల నోస్టాక్‌ అని బోర్డులు దర్శనమివ్వడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుణేలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది . వందలాదిమంది వ్యాక్సిన్‌ కోసం టీకా కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు.

కేంద్రం మహారాష్ట్రకు అదనంగా 17,43 లక్షల డోస్‌లను పంపించడానికి ఒప్పుకుంది. అయినప్పటికి స్టాక్‌ రావడానికి ఆలస్యమవుతోంది. శనివారం ఒక్కరోజే లక్షడోసులకు ముంబైకి పంపించింది కేంద్రం . మరోవైపు వ్యాక్సినేషన్‌ విషయంలో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. 85 రోజుల్లో 10 కోట్ల మందికి టీకా ఇచ్చారు. అమెరికా , చైనా కంటే కూడా భారత్‌లో వ్యాక్సినేషన్‌ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి : Mahabharat actor Satish Kaul : ఆల్ టైమ్ క్లాసిక్ సీరియల్ మహాభారతంలో ఇంద్రుడిగా నటించిన సతీష్ కౌల్ దీనస్థితి.. చివరికి..

57 ఏళ్ల మహిళ 62 ఏళ్ల తన భర్తను పక్కా స్కెచ్ వేసి హతమార్చింది.. షాకింగ్ రీజన్.. ఇలా కూడా ఆలోచిస్తారా..?