Remdesivir : దేశంలో మళ్లీ కరోనా టెర్రర్‌, దివ్య ఔషధంగా భావిస్తున్న రెమిడెసివర్‌ బ్లాక్‌మార్కెటింగ్‌, అరెస్టులు

Remdesivir : కరోనా కేసులు విజృంభించడంతో రెమిడెసివర్‌కు చాలా డిమాండ్ పెరిగింది.

Remdesivir : దేశంలో మళ్లీ కరోనా టెర్రర్‌, దివ్య ఔషధంగా భావిస్తున్న రెమిడెసివర్‌ బ్లాక్‌మార్కెటింగ్‌, అరెస్టులు
Follow us

|

Updated on: Apr 10, 2021 | 10:29 PM

Remdesivir : కరోనా కేసులు విజృంభించడంతో రెమిడెసివర్‌కు చాలా డిమాండ్ పెరిగింది. దీనిని అదనుగా చేసుకొని కొంతమంది ప్రబుద్దులు ఈ మందును బ్లాక్‌మార్కెటింగ్‌ చేస్తున్నారు. పుణేలో రెమిడెసివర్‌ మందును బ్లాక్‌మార్కెట్‌ చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ ఉత్పత్తిని పెంచడానికి ఔషధ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ప్రామాణిక ట్రీట్‌మెంట్‌ ప్రోటోకాల్‌ ప్రకారం ఒక మాదిరి నుంచి తీవ్రంగా కొవిడ్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన కొవిడ్‌ రోగులకు రెమిడెసివర్‌తో చికిత్స చేస్తున్నారు. హెటిరో, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సె్‌సకు చెందిన జుబిలెంట్‌ జెనరిక్స్‌, మైలాన్‌, సిప్లా, జైడస్‌ క్యాడిలా, సన్‌ ఫార్మా.. రెమిడెసివర్‌ను తయారు చేస్తున్నాయి. కొవిడ్‌ కేసులు పెరగడంతో రెమిడెసివర్‌ ఇంజెక్షన్ల ఉత్పత్తిని పెంచమని కంపెనీలను ప్రభుత్వం కోరింది. దీంతో కంపెనీలు ఉత్పత్తి పెంచే ప్రక్రియలో ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రెమిడెసివర్‌ను గత ఏడాది జూన్‌లో మొదటిసారిగా హైదరాబాద్‌కు చెందిన హెటిరో విడుదల చేసింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌, జుబిలెంట్‌ జనరిక్స్‌ కోసం సప్తగిరి లేబొరేటరీస్‌ రెమిడెసివర్‌ తయారు చేస్తున్నాయి.ప్రస్తుతం ఔషధ కంపెనీలు నెలకు 31.6 లక్షల ఇంజక్షన్‌ వయల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా హెటిరో 10.5 లక్షలను ఉత్పత్తి చేస్తుంటే.. సిప్లా 6.2 లక్షలు, జైడస్‌ క్యాడిలా 5 లక్షలు, మైలాన్‌ 4 లక్షలు, మిగిలిన ఔషధ కంపెనీలు నెలకు లక్ష నుంచి 2.5 లక్షల వరకూ రెమిడెసివర్‌ను తయారు చేస్తున్నాయి. త్వరలోనే ఈ ఉత్పత్తి 30-40 శాతం పెరిగేందుకు వీలుంది.. నెలకు 50 లక్షల ఇంజక్షన్లకు పెంచే అవకాశం ఉంది. కొవిడ్‌ రెండో దశ విజృంభణకు ముందు కేసులు తగ్గడంతో కంపెనీలు రెమిడెసివర్‌ ఉత్పత్తిని తగ్గించాయి. గత ఏడాది జూన్‌, జులై నుంచి 2021 జనవరి వరకు దాదాపు రూ.500 కోట్ల విలువైన రెమిడెసివర్‌ను విక్రయించారు. అయితే గత ఏడాది నవంబర్‌లో రెమిడిసివర్‌ విక్రయాలు 125 కోట్లు ఉంటే జనవరి నెలలో అది 45 కోట్లకు పడిపోయింది.

Read also : Vegetable prices : రైతుల కంట కన్నీరు.. చేతికొచ్చిన పంటను ట్రాక్టర్‌తో పొలంలోనే దున్నేస్తున్న వైనాలు

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు