57 ఏళ్ల మహిళ 62 ఏళ్ల తన భర్తను పక్కా స్కెచ్ వేసి హతమార్చింది.. షాకింగ్ రీజన్.. ఇలా కూడా ఆలోచిస్తారా..?

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది.  57 ఏళ్ల మహిళ తన 62 ఏళ్ల భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఇందుకోసం తన బంధువులలో ఒకరి సాయం తీసుకుంది.

  • Ram Naramaneni
  • Publish Date - 5:51 pm, Sat, 10 April 21
57 ఏళ్ల మహిళ  62 ఏళ్ల తన భర్తను పక్కా స్కెచ్ వేసి హతమార్చింది.. షాకింగ్ రీజన్.. ఇలా కూడా ఆలోచిస్తారా..?
Women Kills Husband

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది.  57 ఏళ్ల మహిళ తన 62 ఏళ్ల భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఇందుకోసం తన బంధువులలో ఒకరి సాయం తీసుకుంది. హత్య ఆరోపణలపై పెరిమనల్లూర్ పోలీసులు వీరిద్దరిని శుక్రవారం అరెస్టు చేశారు.

మృతుడిని ఈరోడ్ జిల్లాలోని తుడుపతి నివాసి కె. రంగరాజ్ గా గుర్తించారు. అతను పవర్ లూమ్ యూనిట్ ఉంది. మార్చి 15 న రంగరాజ్ ఒక ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో అతన్ని చికిత్స కోసం కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గురువారం డిశ్చార్జ్ చేశారు. ఈ క్రమంలో రంగరాజ్‌ను తీసుకుని అతడి భార్య జోతిమణి, సమీప బంధువు రాజా కలిసి వ్యాన్‌‌లో తుడుపతికి ప్రయాణాన్ని ప్రారంభించారు.

రాత్రి 11:30 గంటలకు పెరుమనల్లూర్ సమీపంలోని వలసుపాలయం చేరుకున్నప్పుడు రాజా వాహనాన్ని ఆపాడు. రాజా, జోతిమణి వాహనం నుంచి దిగి, వ్యాన్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఘటనలో రంగరాజ్‌ సజీవ దహనం అయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున, రంగరాజ్  మరణం గురించి తిరుపూర్ గ్రామీణ పోలీసులకు రాజా సమాచారం అందించాడు. దీన్ని ఒక యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశాారు. అయితే, దర్యాప్తు సమయంలో రాజా ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో రివర్స్ ఇంట్రాగేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో రాజా ఓ బంక్‌లో డబ్బాలో పెట్రోల్ నింపుకున్నట్లు తేలింది. సదరు సిసిటివి ఫుటేజీని పోలీసులు సేకరించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.

పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. రంగరాజ్ అనేక మంది నుంచి సుమారు 1.5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, వారు డబ్బు కోసం తనను నిరంతరం ఇబ్బంది పెట్టినట్లు  జోతిమణి పోలీసులకు తెలిపింది. రంగరాజ్ రూ .3.5 కోట్ల విలువైన మూడు బీమా పాలసీలను తీసుకుని, నామినీగా జోతిమణి పేరును నమోదు చేశాడు. దీంతో బీమా డబ్బును క్లెయిమ్ చేయాలనే ఉద్దేశ్యంతో జోతిమణి అతన్ని చంపి ప్రమాదంగా చిత్రీకరించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె బంధువు రాజాను అప్రోచ్ అయ్యింది. ఆమె అతనికి రూ .50,000 అడ్వాన్స్‌గా ఇచ్చింది. రంగరాజ్‌ను చంపిన తర్వాత మరో రూ .1 లక్ష ఇస్తానని మాటిచ్చింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, వారు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.

Also Read: 73 ఏళ్ల వృద్ధ మహిళ వరుడు కావాలంటూ ప్రకటన.. ముందుకొచ్చిన 69 ఏళ్ల వ్యక్తి..!

ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో అగ్నిప్రమాదం.. బాంబుల మాదిరిగా పేలిన ఏటీఎం మిషన్లు.. వీడియో