AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhrapradesh: ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో అగ్నిప్రమాదం.. బాంబుల మాదిరిగా పేలిన ఏటీఎం మిషన్లు.. వీడియో

అనంతపురం జిల్లా పమిడి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్‌లో ఆకస్మాత్తుగా మంటలు  చెలరేగాయి. దీంతో పెద్ద.. పెద్ద

Andhrapradesh: ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో అగ్నిప్రమాదం.. బాంబుల మాదిరిగా పేలిన ఏటీఎం మిషన్లు.. వీడియో
Atm Fire Accident
Ram Naramaneni
|

Updated on: Apr 10, 2021 | 6:02 PM

Share

అనంతపురం జిల్లా పమిడి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్‌లో ఆకస్మాత్తుగా మంటలు  చెలరేగాయి. దీంతో పెద్ద.. పెద్ద శబ్దాలతో  ఏటిఎం మిషన్లు పేలిపోయాయి. మంటల దాటికి ఏటీఎం మిషన్లు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపకదళం మంటలు ఆర్పివేశారు. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. నాలుగు ఏటీఎం మిషన్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎస్‌బీఐ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఏటీఎం మిషన్లలో ఎంతమొత్తంలో నగదు ఉన్నది అనే విషయం తెలియాల్సి ఉంది.

మండే ఎండల నేపథ్యంలో నిపుణుల హెచ్చరక…

మండే ఎండలు సెగలు రేపుతోన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ ప్రారంభంలోనే రికార్డు రేంజ్ ఉష్ణోగ్రతలు నమోదవతున్నాయి. దీంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ ఉందని.. జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా పూరి గుడిసెల్లో నివశిస్తోన్న పేద ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read: 73 ఏళ్ల వృద్ధ మహిళ వరుడు కావాలంటూ ప్రకటన.. ముందుకొచ్చిన 69 ఏళ్ల వ్యక్తి..!