Viral News: 73 ఏళ్ల వృద్ధ మహిళ వరుడు కావాలంటూ ప్రకటన.. ముందుకొచ్చిన 69 ఏళ్ల వ్యక్తి..!
తోడు.. ప్రపంచంలోని ప్రతి మనిషికి అవసరం. ఫ్రెండ్స్, బంధువులు కూడా చాలామందికి తోడుగా ఉంటారు. కానీ అన్ని సందర్భాలలో కాదు. అయితే లైఫ్‌లోని...
తోడు.. ప్రపంచంలోని ప్రతి మనిషికి అవసరం. ఫ్రెండ్స్, బంధువులు కూడా చాలామందికి తోడుగా ఉంటారు. కానీ అన్ని సందర్భాలలో కాదు. అయితే లైఫ్‌లోని ప్రతి మూమెంట్‌ను షేర్ చేసుకునేది మాత్రం జీవిత భాగస్వామితోనే. ఆ విషయాన్ని లేటుగా గ్రహించిన ఓ బామ్మ.. 73 ఏళ్ల వయసులో.. తన మనసును అర్థం చేసుకునే వరుడి కోసం వెతుకుతుంది. ఇందుకోసం ఆమె ఓ ప్రకటనను కూడా ఇచ్చింది. అయితే తాను బ్రహ్మణ కులానికి చెందిన స్త్రీని కాబట్టి వరుడు బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాడై ఉండాలంటోంది.
ఆమె స్టోరీ గురించి పూర్తిగా చెప్పేముందు.. మీకు ఒక పాత సామెతను గుర్తుచెయ్యాలి. ప్రేమకు, వయసుతో సంబంధం లేదు. ఇది అందరూ నమ్మే విషయమే. ఇక మనం మన స్టోరీలోకి వెళ్లిపోదాం. మైసూర్‌కు చెందిన 73 ఏళ్ల రిటైర్డ్ మహిళా టీచర్ ఇప్పుడు తనకు తగ్గ వరుడి కోసం వెతుకుతూ ప్రకటన విడుదల చేశారు. పెళ్లి కోసం ఆ మహిళ ఇచ్చిన ప్రకటనలో, తాను చాలా కాలంగా ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పింది. కానీ, ఇప్పుడు తనకో తోడు కావాలని భావిస్తున్నట్లు చెప్పింది. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదని, ఎందుకంటే వయస్సుతో వివాహానికి సంబంధం లేదని ఆమె చెబుతోంది. ఏ వయస్సులో అయినా, ఎవరైనా ఒక తోడును వెతుక్కుంటే.. ఆ నిర్ణయాన్ని గేలి చేయకుండా.. అందరూ గౌరవించాలని ఆమె పేర్కొంది.
ఈ ప్రకటన స్థానికంగా చర్చనీయాంశమైంది. 69 ఏళ్ల వ్యక్తి ఆమెను వివాహం చేసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశాడని తెలుస్తోంది. అతను రిటైర్డ్ ఇంజనీర్ అని చెబుతున్నారు. అయితే, ఈ వ్యక్తి గురించి పూర్తి సమాచారం అందుబాటులోకి రాలేదు. అందుతున్న సమాచారం ప్రకారం, మహిళ గతంలో విడాకులు తీసుకుంది. చాలాకాలంగా ఒంటరిగా నివశిస్తోంది. భయం వల్ల చాలా సంవత్సరాలు పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. కానీ తాజాగా ఆమె మరోసారి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. 73 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న ఈ నిర్ణయానికి కొంతమంది మద్దతు పలికారు. మరికొందరు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు.
Also Read: లాక్‌డౌన్ ప్రకటనతో ప్రయాణికుల ఆందోళన.. బస్సుల్లో నిలబడి ప్రయాణించడం నిషేధం… తాజా ఆదేశాలు