Summer Tips: వేసవిలో ఈ హెల్త్ సమస్యలతో బాధపడుతున్నారా ? ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే..
Summer Healthy Tips: ఈ వేసవిలో ఎక్కువగా అన్నం తినడానికి ఇష్టపడరు. ఇక అన్నం మినహా నచ్చిన ఆహార పదార్థాలను తినేస్తుంటారు. ఇక ఆ తర్వాత కడుపు నొప్పి
Summer Healthy Tips: ఈ వేసవిలో ఎక్కువగా అన్నం తినడానికి ఇష్టపడరు. ఇక అన్నం మినహా నచ్చిన ఆహార పదార్థాలను తినేస్తుంటారు. ఇక ఆ తర్వాత కడుపు నొప్పి, కడుపులో మంట, ఆకలి వేయకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కోంటుంటారు. వీటికి కారణం మీరు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడమే అంటున్నారు నిపుణులు. అందుకే వేసవి కాలంలో అధిక వేడితోపాటు.. మీ జీవన శైలిలో జరిగే ఆహార మార్పుల వలన జీర్ణ సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే మీరు ఈ వేసవిలో జీర్ణ సమస్యల భారిన పడకుండా ఉండాలంటే ఈ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మరీ అవెంటో తెలుసుకుందామా.
గ్యాస్ర్టోఎంటెరిటిస్ సమస్యల సాధరణంగా అన్ని వయసుల సీజన్స్‌తో సంబంధం లేకుండా వస్తుంది. ఈ సమస్యకు లక్షణాలు.. వాంతులు, వాటర్ మోషన్స్, కడపు నొప్పి ఉంటాయి. ఇవే కాకుండా.. కామెర్లు, హెపటైటిస్ వంటి లక్షణాలకు దారి తీస్తుంది. శుభ్రంగా లేని ఆహారం తినడం, కలుషితమైన నీరు తాగడం వలన ఈ సమస్యలు ఎదురవుతాయి. అలాగే వేసవి కాలంలో ఎక్కువగా హైగ్రేడ్ జ్వరం, అలసట, బలహీనత, కడుపు నొప్పి, తలనొప్పి కలుగుతుంటాయి. ఇలాంటి సమస్యలన్ని ఎదుర్కోవడానికి కారణం కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్లనే అని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, చెంబూర్ లోని జెన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రాయ్ పటాంకర్ అన్నారు.
అలాగే వికారంగా ఉండడం, యాసిట్ రిఫ్లక్స్ వంటి సమస్యలతోపాటు.. బ్లడ్ పర్సంటెజ్ తగ్గిపోవడం, జుట్టు రాలిపోవడం, అలాగే కణజాలాల మధ్య ప్రదేశాలలో నీరు రావడం జరుగుతుంది. బాడీలో నీటి శాతం తగ్గడం వలన మలబద్ధకం సమస్య ఎదురవతుంది. అలాగే ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (ఐబీఎస్) కూడా వేసవిలో ఎక్కువగా ఎదురయ్యే సమస్య.
వేసవిలో జీర్ణ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. * తక్కువగా కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అలాగే ఎక్కువగా ఫైబర్ ఉండే తాజా ఫ్రూట్స్, కూరగాయలు, పప్పు ధాన్యాలు, బీన్స్, చిక్కుళ్ళు తినండి. అలాగే తక్కువగా భోజనం చేయండి. అలాగే ఆకుపచ్చ కూరగాయలు, టమోటాలు, ఆపిల్, బేరి, పుచ్చకాయ, దోసకాయ, చిలగడదుంపలు, పైనాపిల్ వంటివి తినడం ఉత్తమం. ఇవి ఎక్కువ సేపు హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడతాయి. అంతేకాకుండా.. దోసకాయ, టమోటా, క్యారెంట్, ఉల్లిపాయలతో సలాడ్లు తయారు చేసుకోవడం చాలా మంచిది. అలాగే పండ్లు, గింజలను తినడం కూడా ముఖ్యమే. అంతేకాకుండా ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు ఎక్కువగా ఉండే పదార్థా్లను తీసుకోండి. * సమ్మర్లో ఎక్కువగా నీరు తాగాలి. దీనివలన మలబద్ధకం సమస్య తగ్గుతుంది. కొబ్బరి నీరు తాగాడం వలన కడుపులోని యాసిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే అధిక వేడిని నియంత్రిస్తుంది. * ఎక్కువగా మసాలా ఫుడ్, వేయించిన, జంక్ ఫుడ్ తినడం తగ్గించాలి. వీటి వలన కడుపులో మంట, ఉబ్బరం, యాసిడిటి ఎక్కువవుతుంది. కాబట్టి పిజ్జాలు, చిప్స్, బేకరీ వస్తువులు తినకపోవడం ఉత్తమం. * గట్, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉన్నందున్న ప్రోబయోటిక్స్ వచ్చే అవకాశం ఉంది. పెరుగులో అథ్యధిక ప్రోటీన్స్ ఉంటాయి. వీటీవనల జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. విరేచనాలను కూడా తగ్గిస్తుంది. * రోడ్ పక్కన ఉండే ఫుడ్ తినడం పూర్తి మానుకోవాలి. ఎందుకంటే వేసవిలో ఎక్కువగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. * రోజూ వ్యాయామం చేయండి. యోగ చేయడాం, స్వీమ్మింగ్, రన్నింగ్, ఏరోబిక్స్ చేయడం ఉత్తమం.
Also Read: వారికి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ మూడు రెట్లు ఎక్కువ.. అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ విషయాలు