Spirulina Benefits: ప్రపంచంలోనే అత్యున్నత ఆహారం ఈ ‘నాచు మొక్క’ …. ప్రతి రోజూ తినమంటున్న న్యూట్రీషియన్స్
Spirulina Benefits:కొన్ని నాచు జాతికి చెందిన మొక్కలు ఔషధగుణాలను కూడా కలిగి ఉంటాయి. అటువంటి నాచు మొక్కల్లో ఒకటి స్పైరులీనా.. 350 కోట్ల సంవత్సరాల క్రిందటి...
Spirulina Benefits:కొన్ని నాచు జాతికి చెందిన మొక్కలు ఔషధగుణాలను కూడా కలిగి ఉంటాయి. అటువంటి నాచు మొక్కల్లో ఒకటి స్పైరులీనా.. 350 కోట్ల సంవత్సరాల క్రిందటి నీటిమొక్క. దీనిలో వందరకాలకు పైగా విటమిన్లూ, ప్రోటీన్లూ ఇతర పోషకాలూ వున్నాయి. తల్లి పాల తర్వాత అన్ని పోషకాలు గల ఆహారం ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది ప్రపంచంలోనే స్పైరులీనా అత్యుత్తమ ఆహారం అని ఐక్యరాజ్య సమితి 1975 లోనే చెప్పింది.
ఈ స్పైరులీనాలో శరీరానికి, మెదడుకు మేలు చేసే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉన్నాయి. అందుకనే ఈ నాచు మొక్కకు విపరీరమైన డిమాండ్ ఏర్పడింది, కొంతమంది పోషకాహార నిపుణులు ఈ నాచుమొక్కను తినే ఆహారంలో చేర్చుకోమని సలహా కూడా ఇస్తున్నారు. వివిధ రూపాల్లో కూడా ఇది లభిస్తుంది. ఈ స్పైరులీనా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..!
మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువైతే డిఎన్ఏ, ఇతర కణాలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో క్యాన్సర్ వంటి ఇతర వ్యాధుల బారిన పడతారు.. అటువంటి వాటిని స్పైరులీనా లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నిరోధిస్తాయి. ప్రస్తుతం ఎక్కువశాతం మరణాలు గుండె జబ్బులతోనే సంభవిస్తున్నాయి. శరీరంలో పేరుకున్న చెడు కొలస్ట్రాల్ గుండెజబ్బులకు కారణమవుతుంది. అయితే అటువంటి చేదు కొలెస్ట్రాల్ ను ట్రైగ్లిజరైడ్ స్థాయిలను స్పైరులీనా తగ్గిస్తుందని.. తద్వారా గుండె భద్రంగా ఉంటుందని అంటున్నారు.
ఇక మధుమేహ వ్యాధిలో ఒకటైన టైప్ టూ డయాబెటిస్ ను స్పైరులీనా నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కర స్థాయిని నియంత్రిస్తుంది. శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల్లో భాగంగా రోజుకు 2 గ్రాముల స్పిరులినాను టైప్ టూ మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇచ్చారు. రెండు నెలల తర్వాత వారిలో షుగర్ లెవెల్ నియంత్రించబడింది. ఇక దీనిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలున్నాయని క్యాన్సర్ కణితి పరిమాణాన్ని తగ్గిస్తుందని తాము జంతువులపై చేసిన పరిశోధనల్లో తేలిందని చెప్పారు శాస్త్రజ్ఞులు. అంతేకాదు.. దీనిని రోజుకి ఒక గ్రాము చొప్పున తీసుకున్నవారు చాలా మంది క్యాన్సర్ బారినుంచి బయటపడ్డారని తెలిపారు.
బీపీ, మూత్రపిండాల వ్యాధి గ్రస్తులు రక్తహీనత సమస్య ఉన్నవారికి ఈ స్పైరులీనా మంచి ఔషధం అని .. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇక రక్తంలో హిమోగ్లోబిన్‌తో పాటు ఎర్ర రక్త కణాల స్థాయిని కూడా పెంచుతుందని అంటున్నారు. ఎక్కువ పనిచేసినా.. వ్యాయామం చేసినా అలసి పోయేవారు స్పైరులీనా తీసుకుంటే అలసట దరిచేరదు.. ముఖ్యంగా క్రీడాకారులకు, ఎక్కువ పనిచేసే వారికి బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ స్పైరులీనాను ఎంత మొత్తంలో తీసుకోవాలో న్యూట్రిషన్ ను అడిగి తెలుసుకోవాలని అంటున్నారు. ఈ స్పైరులీనా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఇప్పటికే అనేక వార్త కథనాలను మెడికల్ జర్నల్స్ ప్రచురించాయి.
కూతురు మోక్షధ తో రవితేజ ఫోటో.. హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని అందం అంటున్న ఫ్యాన్స్