Health Tips: మరింత ఉత్సాహంగా.. ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని సులభమైన టిప్స్ పాటించండి..
ప్రస్తుతం హడావిడి జీవన విధానంలో చాలా మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. దీంతో అనారోగ్య సమస్యల భారిన పడడమే కాకుండా.. అవి మరింత ఎక్కువగా
ప్రస్తుతం హడావిడి జీవన విధానంలో చాలా మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. దీంతో అనారోగ్య సమస్యల భారిన పడడమే కాకుండా.. అవి మరింత ఎక్కువగా మారిన తర్వాత డాక్టర్స్ వద్దకు పరుగులు పెడుతుంటారు. ఇక చాలా మంది ఉద్యోగస్తులు పని హడావిడిలో బిజీగా ఉండడం వలన శరీరానికి కావాల్సిన శ్రమ కల్పించరు. దీంతో శరీరంలో అధిక కొవ్వు పెరిగిపోవడమే కాకుండా.. రోజంతా డల్‌గా ఉండిపోతారు. అయితే మీ బిజీ లైఫ్ షెడ్యూల్లో కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే.. రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా.. ఆరోగ్యంగానూ ఉంటారు. మరీ అవెంటో తెలుసుకుందామా.
* వాటర్ తాగడం..
శరీరానికి నీరు అనేది చాలా ముఖ్యం. రోజుకు 12 నుంచి 14 గ్లాసుల నీరు తాగడం వలన హైడ్రేట్‌గా ఉండడమే కాకుండా.. ఆరోగ్యంగానూ ఉంటారు.
* సూర్యకాంతి..
మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి సూర్యకాంతి చాలా అవసరం. సూర్యుడి నుంచి విటమిన్ డి లభిస్తుంది. అందుకే రోజూ ఉదయం కనీసం 15 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉండాలి.
* నడవడం..
చాలా మందికి జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేసేంత టైం ఉండదు. దీంతో శరీరానికి శ్రమ ఉండకపోవడమే కాకుండా.. రోజందా డల్ గా ఉంటారు. ప్రతి రోజూ 10,000 లేదా అంతకంటే ఎక్కువ అడుగులు నడవడానికి ప్రయత్నించండి.
* ధ్యానం చేయాలి..
ప్రతిరోజూ కేవలం 15 నిమిషాలు వ్యాయమం చేయడం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
కార్డియో వ్యాయామాలు..
కార్డియో వ్యాయామం చేయడం వలన గుండెకు చాలా మంచిది. ఇందుకోసం మీరు డ్యాన్స్, యోగా, సైక్లింగ్, రన్నింగ్ చేయవచ్చు. ఇలా వారానికి ఐదు సార్లు చేయడం ఉత్తమం.
* స్క్రీన్ వాడకం తగ్గించడం..
ఎక్కువ సేపు స్క్రీన్ చూడడం వలన కళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. దీని వలన నిద్ర సమస్యలతోపాటు మానసిక సమస్యలను కూడా ఎదుర్కోంటారు. నిద్రపోయే అరగంట ముందు నుంచే మొబైల్స్, ల్యాప్ టాప్స్ చూడడం మానేయండి..
* నిద్ర అవసరం..
నిద్ర అనేది మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. రోజుకు 6 నుంచి 7 గంటలు నిద్రపోవడం ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే.. అలసటగా ఉంటారు.
* రెడ్ ఫుడ్స్..
ఎరుపు రంగులో ఉండే ఆహారం తినడం ఉత్తమం. ఇందులో పండ్లు, కూరగాయలను కూడా ఎంచుకోవచ్చు. దుంపలు, దానిమ్మలు కూడా తినవచ్చు. వీటివలన రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.