అలర్ట్.. స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా ? అయితే మీకు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువే.. ఎంటో తెలుసా..
SmartPhones: స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మన జీవన శైలీలో అతిముఖ్యమైన వస్తువులుగా మారిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ స్మార్ట్ ఫోన్స్‌కు
SmartPhones: స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మన జీవన శైలీలో అతిముఖ్యమైన వస్తువులుగా మారిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ స్మార్ట్ ఫోన్స్‌కు బానిసలుగా మారిపోయారు. లాక్ డౌన్ ప్రభావంతో వీటి వాడకం మరింత పెరిగిపోయింది. అయితే పగలు సమయంలో కాకుండా.. రాత్రిళ్లు వీటి వాడకం ఎక్కువగా మారిందంట. చీకటీలో ఎక్కువగా ఫోన్స్ చూస్తూ గడుపుతున్నవారిలో అత్యధికంగా కళ్ళు, మెడకు సంబంధించిన సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొబైల్, టీవీ లేదా కంప్యూటర్లో మనం ఎక్కువ సేపు ఏవైనా వీడియోస్ చూడడం వలన కళ్ళపై స్క్రీన్ లైట్ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుందంట. అలాగే ఫోన్లో గంటలు గంటలు మాట్లాడం వలన అనేక రకాల మెడ సంబంధిత వ్యాధులు వస్యాయని నిపుణులు సూచిస్తున్నారు. మరీ అవెంటో తెలుసుకుందామా.
డ్రై ఐ సిండ్రోమ్..
ఎక్కువగా మొబైల్స్ చూసేవారిలో డ్రైఐ అనే సమస్య వస్తుంది. కళ్లు సరిగ్గా పనిచేయడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉండాలంటే వాటిలో తేమ అవసరం. డ్రై ఐ సిండ్రోమ్ అనేది కంటి ఉపరితలంపై కళ్ళలో ఎక్కువగా తేమ లేకుండా చేస్తుంది. డ్రై ఐ సిండ్రోమ్‌తో బాధపడేవారికి ఎక్కువగా తలనొప్పి, కళ్ళు ఎర్రగా మారడం, వెలుతురు చూడకపోవడం జరుగుతుంది. వీటి వలన కన్నీటి గ్రంథి దెబ్బతింటుంది. దీంతో కన్నీళ్లు ఉత్పత్తి కావడం ఆగిపోతుంది.
సాధారణంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తి నిమిషానికి 16 సార్లు కళ్ళ రెప్పలను ఆడిస్తాడు. కానీ మొబైల్స్ ఎక్కువగా వాడేవారికి బ్లింక్ రేటు 8కి తగ్గుతుంది. అందువల్ల కన్నీటి ఉత్పత్తి తగ్గుతుంది.
స్క్రీన్ టైం..
రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మొబైల్ ఫోన్లు.. టీవీల స్క్రీన్స్ చూడకపోవడం మంచిది. అలాగే రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు రోజూకు 2 గంటలు మించకుండా టీవీ, మొబైల్స్ చూడాలి. 8 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పిల్లలు 4 గంటల నుంచి 5 గంటల వరకు స్క్రీన్ వీక్షించవచ్చు. డాక్టర్ సూచనల ప్రకారం 8 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు రోజుకు 7 నుంచి 10 గంటలు మొబైల్స్, టీవీ స్క్రీన్స్ చూస్తున్నట్టుగా తెలిపారు.
ఆన్ లైన్ క్లాసులు..
కరోనా మహామ్మారి ప్రభావంతో ప్రస్తుతం ఎక్కువగా ఆన్ లైన్ క్లాసెస్ విధానం నడుస్తోంది. అయితే వీటి కోసం దాదాపు రెండు, మూడు గంటలు కేటాయిస్తారు. అయితే ఈ క్లాసుల వలన కళ్ళ సమ్సయలు అధికమవుతాయి. కళ్లకు హానికరమైన బ్లూ లైట్ మొబైల్ ఫోన్, టీవీ స్రీన్స్ నుంచి విడుదలవుతుంది. అయితే ఈ సమస్యను అధిగమించడానికి డాక్టర్ల సూచనల ప్రకారం యాంటీ గ్లేర్ గ్లాసెస్, కృత్రిమ కన్నీళ్లను ఉపయోగించవచ్చు.
చీకటి ప్రదేశాలలో ఫోన్స్ వాడకూడదు..
రాత్రి సమయంలో ఎక్కువగా మొబైల్స్ వాడడం వలన కళ్లు దెబ్బతింటాయి. దృష్టి సమస్య ఉన్నవారు మొబైల్ ఫోన్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎక్కువగా కళ్ళకు రెస్ట్ ఇవ్వాలని కొట్టాయం జనరల్ హాస్పిటల్ సీనియర్ ఐ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ సీజీ మినీ అన్నారు.
కళ్లకు ఫోన్‌కు ఎంత దూరం ఉండాలంటే..
సాధరణంగా ఒక పుస్తకం చదివేటప్పుడు.. మన కళ్ళకు 14 అంగుళాల దూరంలో పుస్తకం ఉండాలి. అలాగే మొబైల్ వాడుతున్నప్పుడు మన కళ్లకు 16 అంగుళాల దూరం ఉండాలి.
కంటి సమస్యలు ఎక్కువగా 30-40 సంవత్సరాల వయస్సు వారిపై ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి.
మొబైల్స్, ల్యాప్ టాప్స్, టీవీ ఎక్కువగా వాడడం వలన 30-40 ఏళ్ల వారికి ఎక్కువగా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మొబైల్ ఫోన్‌కు ఎక్కువగా బానిసైన వారిలో కంటి వ్యాధులే కాకుండా.. మెడ నొప్పి కూడా వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
వారికి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ మూడు రెట్లు ఎక్కువ.. అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ విషయాలు