ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఇక్కడ దేవుడు.. ఆయన్ని దర్శించుకోవాలంటే హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం

మనదేశంలో ఎక్కువగా శైవ వైష్ణవ క్షేత్రాలున్నాయి. అయితే శివుడు లింగాకారంలో ఎక్కువగా పూజలను అందుకోగా..విష్ణువు మాత్రం అవతారాల్లోని రూపాలతో పూజలను అందుకుంటున్నాడు. అయితే కొన్ని చోట్ల విష్ణువు శ్రీ అనంతపద్మనాభస్వామిగా పూజలను అందుకుంటున్నారు. అయితే కేరళలో శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయం ఎన్నో విశిష్టతలు, మిస్టరీలతో నిండి ఉంది.

  • Surya Kala
  • Publish Date - 4:39 pm, Sat, 10 April 21
1/7
Ananta Padmanabha Swami
కేరళలోని శ్రీ అనంతర పద్మనాభస్వామి ఆలయం శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యాదేశములు అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమద్భాగవతంలో బలరామదేవుడు తన తీర్ధయాత్రలో భాగంగా శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పద్మతీర్ధంలో స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు స్థల పురాణం
2/7
Sree Padmanabhaswamy
అనంతపద్మనాభుడు అంటే నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. అటువంటి ఈ ఆలయం గురించి స్వామివారి గురించి తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో ఉంది. క్రీ.శ 16వ శతాబ్ధంలో ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపంగా నిలుస్తుంది.
3/7
Sree Padmanabhaswamy Temple
తిరు.. అనంత.. పురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమని అర్ధం. ఈ ఆలయం కారణంగా కేరళా రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది.
4/7
Ssree Padmanabhaswamy Templ
ఇక ఈ అనంత పద్మ నాభస్వామి దర్శించుకోవాలంటే.. ఆలయ ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది.
5/7
Temple
భగవంతుడి రూపం సచ్చిదానందమని హిందువుల నమ్మకం. గర్భాలయంలో ఉన్న ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలోఉంటాడు. అయితే ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు.
6/7
Temple Treasure 2
అయితే అనంతపద్మనాభస్వామివారి దేవాలయంలో సంపద బయటపడనంత వరకూ.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవుడు.. తిరుమల వడ్డికాసులవాడు.. అయితే అనంత పద్మ నాభ స్వామి వారి దేవాలయం లో అనంత సంపద బయల్పడింది. దీంతో వజ్రాలు, వైడుర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అనన్తరపద్మనాభస్వామి ప్రపంచంలోనే అత్యంత సంపన్నాడుగా ఖ్యాతిగాంచాడు.
7/7
Temple Treasure
ఇప్పటివరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనే పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణేలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి నగలు ఇలా అనంతమై సంపద బయటపడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి వుంచబడి వున్నదని తెలుస్తున్నది.