తన ఊపిరితిత్తులు కరోనా సోకిన భార్యకు ఇచ్చి ఊపిరి పోసిన భర్త.. జపాన్ లో సక్సెస్ అయిన లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్!
కరోనా వైరస్ సోకితే ఊపిరితిత్తులు(లంగ్స్) దెబ్బతినే అవకాశం ఉంది. ఒకసారి లంగ్స్ దెబ్బతింటే వాటిని ఆరోగ్యకరంగా మార్చడం వీలుపడే అవకాశం చాలా తక్కువ.
కరోనా వైరస్ సోకితే ఊపిరితిత్తులు(లంగ్స్) దెబ్బతినే అవకాశం ఉంది. ఒకసారి లంగ్స్ దెబ్బతింటే వాటిని ఆరోగ్యకరంగా మార్చడం వీలుపడే అవకాశం చాలా తక్కువ, మామూలుగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఒక్కోసారి వాటిని మార్చాల్సిన పరిస్థితి వస్తే మారుస్తారు. కానీ, ఇప్పటివరకూ కరోనా కారణంగా లంగ్స్ పాడైన వారికి వాటిని మార్చిడం జరగలేదు. కానీ, ఇప్పుడు జపాన్ లో అలా చేసిన ఒక ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స విజయవంతం అయింది. అయితే, ఇది బ్రెయిన్ డెడ్ అయిన వారి ఊపిరితిత్తులతో కాదు. జీవించి ఉన్నవారి లంగ్స్ తో మార్పిడి చేశారు.
దాదాపు 11 గంటలు పట్టిన ఈ ఆపరేషన్ జపాన్ లో జరిగింది. ఒక జపాన్ మహిళకు కోవిడ్ సోకింది. కరోనా తగ్గినా ఆమె ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. లంగ్స్ కి ఆపరేషన్ చేసి కొంత భాగం మార్చకపోతే ఆమె బ్రతికే ఛాన్స్ లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరితిత్తుల దాతకోసం వెతుకులాడారు. అయితే కరోనా నేపథ్యంలో డజన్ల కొద్దీ పేషేంట్స్ ఊపిరితిత్తుల మార్పిడి కోసం ఆసుపత్రులలో ఎదురుచూస్తున్నారు. దీంతో వారికి డోనర్ దొరకడం కష్టంగా మారింది. ఎలాగైనా ఆమెను బ్రతికించుకోవాలని భావించిన వారు డాక్టర్లను సంప్రదించారు. ఆ మహిళ భర్త, కుమారుడు బ్రతికి ఉండగానే తమ ఊపిరితిత్తుల్లో కొద్దిభాగం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీంతో వైద్యులు వారి అభ్యర్ధన మన్నించి వారి లంగ్స్ నుంచి కొంత భాగాన్ని తీసి పేషేంట్ కు అమర్చారు. ఈ ట్రాన్స్ ప్లాంటేషన్ సక్సెస్ అయింది. ప్రస్తుతం ఆ మహిళా ఐసీయూలో వేగంగా కోలుకుంటున్నారు.
నిజానికి ఇలా లైవ్ లంగ్స్ తీసుకోవడానికి వైద్యులు అంగీకరించారు. రూల్స్ ఒప్పుకోవు. కానీ, ప్రత్యేక అనుమతి ఈ కేసులో ఇచ్చారు. ఈ విషయం పై ప్రొఫెసర్ హిరోషి దాటే మాట్లాడుతూ ”మాకు చాలా నమ్మకం ఉంది ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని. ఇది సక్సెస్ అయితే ఇటువంటి మరింత మంది పేషేంట్స్ కు చికిత్స అందించేందుకు కొత్త ఆప్షన్ దొరికినట్టవుతుందని దీనికి అంగీకరించి ఆపరేషన్ చేశాం అని చెప్పారు.