Corona Virus: ఇండియాలో కరోనాను కట్టడి చేయాలంటే ఆ నాలుగే మార్గాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఇండియాను కోవిడ్ రెండో వేవ్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ దశలో కోవిడ్ ను ఎదుర్కోవడానికి భారత్ ముందు నాలుగు మార్గాలు ఉన్నాయని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఇండియాను కోవిడ్ రెండో వేవ్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ దశలో కోవిడ్ ను ఎదుర్కోవడానికి భారత్ ముందు నాలుగు మార్గాలు ఉన్నాయనీ.. అవి కచ్చితంగా పాటిస్తే కరోనా రెండో వేవ్ ను సమర్ధంగా ఎదుర్కోవచ్చనీ చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
కరోనా కట్టడికి నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే అని డబ్ల్యుహెచ్వో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ అంటున్నారు. పరీక్షలు చేయడం..కరోనా బాధితులను కనిపెట్టడం.. ఐసోలేషన్ లో ఉంచడం,, ట్రీట్ మెంట్ ఇవ్వడం (టెస్ట్, ట్రేస్, ఐసోలేషన్, ట్రీట్ మెంట్) ఈ నాలుగు విధానాలే కరోనా కట్టడికి మంచి మార్గాలని ఆమె అన్నారు. చికిత్స మరింత వేగవంతంగా చేయాలని ఆమె చెప్పారు. కరోనా కట్టడి కోసం ప్రజలంతా నిబంధనలు పాటించడం తప్పనిసరి అనీ.. లాక్ డౌన్ కి నిబంధనలు పాటించడానికి సంబంధం లేదనీ ఆమె అన్నారు. కొత్తగా వస్తున్నా కరోనా రకాలు ప్రపంచంలో అంత వేగంగా వ్యాప్తి కావడంలేదని చెప్పారు. అయినా, వాటి వ్యాప్తిని అడ్డుకునేందుకు డబ్ల్యుహెచ్వో అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఇక ఏప్రిల్ మొదటి నుంచి ఇండియాలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. డబ్ల్యుహెచ్వో నివేదిక ప్రకారం గడచినా 24 గంటల్లో 1,31,968 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్యా 1,30,60,542 గా నమోదు అయింది. గత ఆరున్నర నెలల కాలంలో దేశంలో పది లక్షలకు పైగా కొత్తగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.