లాక్‌డౌన్‌ ప్రకటనతో ప్రయాణికుల ఆందోళన.. బస్సుల్లో నిలబడి ప్రయాణించడం నిషేధం… తాజా ఆదేశాలు

Coronavirus Effect: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్‌ వైపు ఆలోచిస్తున్నాయి ప్రభుత్వాలు....

లాక్‌డౌన్‌ ప్రకటనతో ప్రయాణికుల ఆందోళన.. బస్సుల్లో నిలబడి ప్రయాణించడం నిషేధం... తాజా ఆదేశాలు
Subhash Goud

|

Apr 10, 2021 | 1:32 PM

Coronavirus Effect: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్‌ వైపు ఆలోచిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక తమిళనాడు రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి పలు నిబంధనలతో తాత్కాలిక లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అందులో భాగంగా బస్సుల్లో నిలబడి ప్రయాణాన్ని నిషేధం విధించింది. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనంగా 400 బస్సులు నడపాలని మెట్రో ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ) నిర్ణయం తీసుకుంది. ఎంటీసీ విడుదల చేసిన ప్రకటనతో రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణం చేయరాదని, ఒక బస్సులో 44 మంది మాత్రమే కూర్చునేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వం తాజాగా వెల్లడించిన నిబంధనలతో శనివారం నుంచి ప్రతి రోజు 300 నుంచి 400 అదనపు బస్సులు నడపనున్నామని అన్నారు. అధిక రద్దీ ఉన్న చెంగల్పట్టు, గుడువాంజేరీ, తాంబరం, కేళంబాక్కం, సెమ్మంజేరీ, పెరుంబాక్కం, మనలి, కన్నగైనరగ్‌, పెరంబూరు, అంబత్తూర్‌, అవడి, తిరువొత్తియూర్‌, రెడ్‌హిల్స్‌ తదితర మార్గాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ అదనపు బస్సులు నడపనున్నామని, ప్రయాణికులు తప్పకుండా మాస్క్‌లు ధరించి ప్రయాణించాలని కోరింది.

ఇవీ చదవండి: Covid-19: అక్కడ మాస్క్ లేకుండా కనిపిస్తే అంతే సంగతి…2 రోజుల్లో రూ.10లక్షల జరిమానా వసూలు

దేశంలో మళ్లీ విరుచుకుపడుతున్న మహమ్మారి.. ఆంక్షల అమలుతో సినీ రంగానికి కొత్త చిక్కులు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu