West Bengal Election 2021 Phase 4: బెంగాల్‌ హాట్ హాట్‌గా 4వ దశ పోలింగ్‌.. రక్తమోడిన ఓట్ల పండుగ

Balaraju Goud

| Edited By: Sanjay Kasula

Updated on: Apr 10, 2021 | 8:34 PM

బెంగాల్‌ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఓటేసే పండగ నాడు బెంగాలీలకు నల్లగుర్తు కన్నా ఎర్రగుర్తును ఎక్కువగా చూశారు. బీజేపీ- టీఎంసీ మధ్య సాగుతున్న మసాలా డైలాగ్‌వార్‌.. ఎలక్షన్‌ హీట్‌ను పెంచేసింది.

West Bengal Election 2021 Phase 4: బెంగాల్‌ హాట్ హాట్‌గా 4వ దశ పోలింగ్‌.. రక్తమోడిన ఓట్ల పండుగ
West Bengal 4th Elections 2021

బెంగాల్‌ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. బీజేపీ- టీఎంసీ మధ్య సాగుతున్న మసాలా డైలాగ్‌వార్‌.. ఎలక్షన్‌ హీట్‌ను పెంచేసింది. కుచ్‌బీహార్‌ జిల్లాలో జరిగిన CRPF కాల్పల్లో ఐదుగురు చనిపోవడం సంచలనగా మారింది. ఇది కేంద్రబలగాల హత్య అని మమత ఆరోపిస్తే, ఓటమి ఖాయమనే దీదీ ఇలా మాట్లాడుతున్నారంటూ మోదీ కౌంటర్‌ ఇచ్చారు. అటు మాటలు- ఇటు హింసతో బెంగాల్‌ అట్టుడుకుతోంది.

బంగారు బంగ్లా, సమూల మార్పు అని నినాదాలు చేసుకుంటే ఎన్నికల హింస, చావులు బెంగాల్‌ను భయపెడుతున్నాయి. బెంగాల్‌లోని కుచ్‌ బీహార్‌ జిల్లా సీతాకుల్చి సెగ్మెంట్లో CRPF జవాన్ల కాల్పుల్లో నలుగురు మరణించారు. అంతకుముందు మరోచోట కాల్పుల్లో ఒకరు చనిపోయారు. మూర్చపోయిన ఒక వ్యక్తికి చికిత్స చేస్తుండగా జనం ఎగబడ్డారన్న జవాన్లు. ఓటర్లు పొరబడి జవాన్ల తుపాకులు లాక్కున్నారంటున్న CRPF. ప్రజలు తిరగబడితే కాల్పులు జరిపామంటున్న CRPF అధికారులు.

ఇదిలావుంటే, కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయంటూ మమతా బెనర్జీ ఆరోపించడంపై ఎలక్షన్‌ కమిషన్‌ సీరియ్‌సగా స్పందించింది. బాధ్యతరహితమైన, రెచ్చగొట్టేట్లుగా అసహనంతో కూడిన తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అంటూ ఆమెకు నోటీసులు జారీచేసింది. శనివారం ఉదయం 11 గంటలలోగా సమాధానమివ్వాలని కోరింది.అయితే ఈ నోటీసులను లెక్కచేసేది లేదని మమత చెప్పారు. కాగా, మమత భద్రతా అధికారి అశోక్‌ చక్రవర్తిని ఈసీ శుక్రవారం ఆకస్మికంగా బదిలీ చేసింది.

Read Also.. New Covid Centers : హైదరాబాద్‌లో కొత్తగా నాలుగు కొవిడ్ కేర్‌ కేంద్రాల ఏర్పాటు.. ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Apr 2021 06:17 PM (IST)

    సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 76.16 శాతం పోలింగ్

    పశ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో ఈ రోజు ఓటింగ్ జరుగుతోంది. ఇంతలో, సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 76.16 శాతం పోలింగ్ జరిగింది. కూచ్ బెహార్‌లో ఓటరు 79.73 శాతం, అలీపూర్‌దుర్ 73.65 శాతం, హౌరా 75.03 శాతం, సౌత్ 24 పరగనాస్ జిల్లా 75.49 శాతం, హుగ్లీ 76.02 శాతం ఓట్లు నమోదయ్యాయి.

  • 10 Apr 2021 05:07 PM (IST)

    మధ్యాహ్నం 3 గంటల వరకు…

    మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం 66.76 శాతం ఓటింగ్ జరిగింది. కూచ్ బెహార్‌లో 70.39 శాతం, అలీపుర్దువార్‌లో 68.37 శాతం, హౌరాలో 64.88 శాతం, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 64.26 శాతం, హూగ్లీలో 67.45 శాతం పోలింగ్ జరిగింది.

  • 10 Apr 2021 03:42 PM (IST)

    బూత్ 126 వద్ద ఓటింగ్ నిలిపివేత

    కూచ్ బెహార్‌లోని షీతాల్‌కుచి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 126 వద్ద ఓటింగ్ నిలిపివేయబడింది. ఇందుకు సంబంధించిన వివరాలను  జల్పాయిగురి రేంజ్ డిఐజి  వెల్లడించారు.

  • 10 Apr 2021 03:41 PM (IST)

    షీతాల్‌కుచి హింసలో ఓ యువకుడికి గాయాలు

    షూటింగ్‌ సంఘటనలో గాయపడిన యువకుడి ఫోటో షీతాల్‌కుచిలోని బూత్‌ నెం .126 లో వెలుగులోకి వచ్చింది. తలకు గాయం కావడంతో అతను చాలా రక్తస్రావం అయ్యింది. 

  • 10 Apr 2021 03:39 PM (IST)

    ఓటు హక్కును వినియోగించుకున్న గంగూలీ

    సౌరవ్ పంగనాలోని బెహాలాలోని ఒక పోలింగ్ కేంద్రంలో సౌరవ్ గంగూలీ  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 10 Apr 2021 03:34 PM (IST)

    షీటాకుచి బూత్‌లో సిఆర్‌పిఎఫ్ మోహరించ లేదు

    షీటాకుచిలో జరిగిన హింసాత్మక సంఘటనపై సిఆర్‌పిఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. సిఆర్‌పిఎఫ్ బృందాన్ని బూత్ నంబర్ -126 వెలుపల మోహరించలేదని ఈ సంఘటనలో ఏ విధంగానూ తమ బాధ్యత లేదని పేర్కొంది.

  • 10 Apr 2021 03:32 PM (IST)

    ఇసిని కలిసిన బిజెపి ప్రతినిధి బృందం

    బిజెపి నాయకుల ప్రతినిధి బృందం ఈ రోజు కోల్‌కతాలో ఎన్నికల సంఘాన్ని కలుస్తుంది.

  • 10 Apr 2021 03:31 PM (IST)

    మధ్యాహ్నం 1:37 వరకు 52.89 శాతం ఓటింగ్

    పశ్చిమ బెంగాల్‌లో మధ్యాహ్నం 1.37 గంటలకు 52.89 శాతం పోలింగ్ జరిగింది.

  • 10 Apr 2021 03:27 PM (IST)

    ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఓటింగ్..

    ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 56.93 శాతం ఓటింగ్ జరిగింది. అలీపుర్దువార్‌లో, హౌరాలో 51.23 శాతం, హగ్లీలో 54.20 శాతం, సౌత్ 24 పరగణాల్లో 48.39 శాతం, కూచ్ బెహార్‌లో 56.87 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 10 Apr 2021 02:12 PM (IST)

    మా పార్టీ కార్యకర్తలు నలుగురు మృతి చెందారుః టీఎంసీ

    తమ పార్టీకి చెందిన అయిదుగురు కార్యక‌ర్తలు మృతిచెందిన‌ట్లు తృణ‌మూల్ కాంగ్రెస్ పేర్కొన్నది. నాలుగో ద‌శ ఎన్నిక‌ల కోసం సుమారు 80 వేల మంది సీఏపీఎఫ్ ద‌ళాల‌ను మోహ‌రించారు. సుమారు 16,000 పోలింగ్ బూత్‌లను ఆ ద‌ళాలు ప‌హారా కాస్తున్నాయి. కేవ‌లం కూచ్ బెహ‌ర్ జిల్లాలోనే అత్యధికంగా 187 కంపెనీల సీఏపీఎఫ్ ద‌ళాల‌ను మోహ‌రించారు.

  • 10 Apr 2021 02:08 PM (IST)

    ఐదుకు చేరిన మృతుల సంఖ్య

    సీతాల్‌కుచి ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. కూచ్ బెహ‌ర్ జిల్లాలో పోలింగ్ కేంద్రం వ‌ద్ద కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకుంది. బీజేపీ, తృణ‌మూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఘ‌ర్షణ‌కు దిగారు. ఘ‌ర్షణ స‌మ‌యంలో అక్కడే ఉన్న సీఆర్‌పీఎఫ్ ద‌ళాలు ఫైరింగ్‌కు దిగాయి. ఆ స‌మ‌యంలో జ‌రిగిన కాల్పుల్లో అయిదుగురు చ‌నిపోయిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఎన్నిక‌ల సంఘం నివేదిక కోరింది.

  • 10 Apr 2021 01:39 PM (IST)

    కూచ్ బెహార్‌లోని 126 పీఎస్‌లో పోలింగ్ వాయిదా

    సీఆర్‌పీఎఫ్ కాల్పుల నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్పెషల్ అబ్జర్వర్ల మధ్యంతర నివేదిక ఆధారంగా సీతల్‌కుర్చి అసెంబ్లీ నియోజకవర్గంలోని కూచ్ బెహార్‌లోని పోలింగ్ స్టేషన్ 126 పోల్‌ను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎస్ఈవో నుంచి వివరణాత్మక నివేదికలు కోరుతున్నట్లు భారత ఎన్నికల కమిషన్ తెలిపింది.

  • 10 Apr 2021 12:20 PM (IST)

    బీజేపీ అభ్యర్థి , ఐఎస్‌ఎఫ్ అభ్యర్థి పరస్పర అభివాదం

    ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఛైర్మెన్, భంగార్ అభ్యర్థి నౌషద్ సిద్ధిఖీ, బీజేపీ అభ్యర్థి సౌమీ హాతీ పరస్పర కలుసుకుని అభివాదం చేసుకున్నారు. సౌత్ 24 పరగనాస్ జిల్లాలోని భంగర్ నియోజకవర్గంలోని హటిసాలా సరోజిని హై మదర్సా హైస్కూల్‌లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో ఇద్దరు ప్రత్యర్థులు తారాసపడ్డారు. దీంతో ఒకనొకరు పలకరించుకున్నారు.

  • 10 Apr 2021 12:13 PM (IST)

    ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

    సెంట్రల్ ఫోర్సెస్ రెండుసార్లు కాల్పులు జరిపింది. కూచ్ బెహార్ జిల్లా మాతాభంగాలోని బ్లాక్ 1 లో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సీతాల్‌కుచి బ్లాక్‌లో ముగ్గురు మరణించారు. మరొకరు గాయపడ్డారు. కేంద్ర దళాలు వారి పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నార బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం ప్రజలకు అన్యాయం చేస్తోందని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది టీఎంసీ.

  • 10 Apr 2021 12:06 PM (IST)

    సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో నలుగురు మృతి

    సితాకుల్చీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జోర్ పట్టీ ప్రాంతంలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పర దాడులకు తెగబడ్డారు. ఈ నేపధ్యంలో సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.

  • 10 Apr 2021 11:18 AM (IST)

    ఉదయం 11గంటల వరకు 16.65 శాతం పోలింగ్

    పశ్చిమ బెంగాల్‌లో నాలుగో దశ పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11గంటల వరకు 16.65 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నిక సంఘం అధికారులు పేర్కొన్నారు.

  • 10 Apr 2021 11:05 AM (IST)

    ద్ధ మహిళకి సాయం అందించిన ఐటీబీపీ సిబ్బంది

    హూగ్లీ జిల్లాలోని రిష్రాలోని పోలింగ్ బూత్‌ల వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న ఐటీబీపీ సిబ్బంది ఒక వృద్ధ మహిళకి సాయం అందించారు. నడవలేనిస్థితిలో ఓటేసేందుకు వచ్చిన మహిళచేత ఓటు వేయించారు.

  • 10 Apr 2021 11:03 AM (IST)

    హుగ్లీలో మీడియా వాహనాల ధ్వంసం

    బెంగాల్ ఎన్నికల సందర్భంగా హుగ్లీలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రెచ్చిపోయిన స్థానికులు మీడియా వాహనాలను ధ్వంసం చేశారు.

  • 10 Apr 2021 11:01 AM (IST)

    హుగ్లీలో బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీపై దాడి

    హుగ్లీలో బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీపై స్థానికుల దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది.

  • 10 Apr 2021 10:59 AM (IST)

    టీఎంసీ ఓటమి తథ్యంః రాజీబ్ బెనర్జీ

    బెంగాల్‌లో ప్రశాంత్ కిషోర్ వ్యూహం బెడిసికొట్టింది. ఇక్కడ ప్రధాని మోదీ వ్యూహం మాత్రమే ఫలించింది. టీఎంసీ ఓటమి తథ్యమని బీజేపీ అభ్యర్థి రాజీబ్ బెనర్జీ.

  • 10 Apr 2021 10:57 AM (IST)

    టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు

    కూచ్‌బెహర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీతల్‌కూచి నియోజకవర్గంలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకున్నాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టడంతో గొడవ సర్ధుమణిగింది.

  • 10 Apr 2021 10:52 AM (IST)

    మోదీ నేతృత్వంలోనే బంగారు బెంగాల్ సాధ్యంః

    ప్రధాని మోడీనే అత్యుత్తమ నాయకుడని ఆయన నేతృత్వంలోనే బంగారు బెంగాల్ సాధ్యమవుతుందనే విషయం ప్రశాంత్ కిషోర్‌కు కూడా తెలుసు. ఈ విషయం తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు టీఎంసీతో జతకట్టాడని బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ హుగ్లీలో అన్నారు.

  • 10 Apr 2021 10:30 AM (IST)

    మానవత్వం చాటుకున్న జవాన్

    అలీపూర్‌దౌర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నడవలేని స్థితిలో ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళను అక్కడి ఉన్న జవాన్ తన చేతులపై ఎత్తుకుని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు.

    West Bengal Assembly Polls

    West Bengal Assembly Polls

  • 10 Apr 2021 10:27 AM (IST)

    హెల్మెట్ ధరించి పోలింగ్ బూత్‌కు వచ్చిన టీఎంసీ అభ్యర్థి

    ఓటు వేయడానికి హెల్మెంట్ ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చిన కూచ్ బెహర్ జిల్లా నటాబరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి రబీంద్రనాథ్ ఘోష్. బీజేపీ కార్యకర్తలు పోలింగ్ బూత్‌ను ఆక్రమించుకుంటున్నారని, అవాంఛనీయ దాడుల వల్ల దెబ్బలు తగలకుండా రక్షణగా హెల్మెట్ ధరించినట్లు ఆయన చెప్పారు.

    Tmc Candidiate With Helmet

    Tmc Candidiate With Helmet

  • 10 Apr 2021 08:22 AM (IST)

    ఓటర్లకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు

    కోవిడ్ ప్రొటోకాల్ మధ్య బెంగాల్ నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లకు థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షలను నిర్వహించిన తరువాతే ఓటు వేయడానికి అనుమతి ఇస్తున్నారు ఎన్నికల సిబ్బంది.

    West Bengal Assembly Polling

    West Bengal Assembly Polling

  • 10 Apr 2021 08:14 AM (IST)

    ఐడీ కార్డు లేదని బీజేపీ ఎజెంట్‌కు అనుమతి నిరాకరణ

    కోల్‌కతాకు చెందిన టోలీగంగే నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి బాబుల్ సుప్రియో గాంధీ కాలనీ భారతి బాలికా విద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు, అక్కడ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్‌ను అనుమతించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “అతనికి ఐడి ఉంది కాని ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుమతించలేదు. మేము అతని వివరాలను వెబ్‌సైట్ నుండి చూపించాము. దీంతో అతన్ని అనుమతించినట్లు బాబుల్ సుప్రియో తెలిపారు.

  • 10 Apr 2021 08:08 AM (IST)

    భంగర్‌లో బారులు తీరిన ఓటర్లు

    దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భంగర్‌లో ఓటు వేసేందుకు భారీగా ఓటర్లు చేరుకుంటున్నారు. హత్‌గచా హరిదాస్ విద్యాపీఠ్ హైస్కూల్ వెలుపల ప్రజలు క్యూలో నిలబడ్డారు.

  • 10 Apr 2021 08:01 AM (IST)

    బీజేపీపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఎంసీ

    నాలుగో దశ ఎన్నికల పోలింగ్‌పై బీజేపీపై టీఎంసీ నేతలు మండిపడ్డారు. “సీతాల్‌కుచి, నటల్‌బరి, తుఫంగంజ్, దినాహటా నియోజకవర్గాల్లోని అనేక బూత్‌ల్లో బీజేపీ కార్యకర్తలు బూత్ వెలుపల ఒక అరాచకం సృష్టిస్తున్నారు. టీఎంసీ ఏజెంట్లు బూత్‌లోకి రాకుండా అడ్డుకుంటున్నారు” అని టీఎంసీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. బీజేపీపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసిని కోరింది టీఎంసీ.

  • 10 Apr 2021 07:44 AM (IST)

    ఆలయంలో లాకెట్ ఛటర్జీ ప్రత్యేక పూజలు

    చుంచూరా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభానికి ముందు ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

  • 10 Apr 2021 07:41 AM (IST)

    భంగర్‌లో ఓటేసిన బీజేపీ అభ్యర్థిగా సౌమీ హతీ

    దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని భంగర్ నియోజకవర్గం నాలుగో దశకు కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థిగా సౌమీ హతీ భంగర్ లోని పంచూరియా ప్రైమరీ స్కూల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 10 Apr 2021 07:38 AM (IST)

    అలీపుర్దువార్‌లో కొనసాగుతున్న పోలింగ్

    నాలుగో దశ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. అలీపుర్దువార్‌లోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద భారీగా తరలివచ్చిన ఓటర్లతో సందడిగా మారింది.

  • 10 Apr 2021 07:34 AM (IST)

    ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలిః పాయల్ సర్కార్

    నా నియోజకవర్గంలో 57 శాతం మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నేను వారిని నమ్ముతున్నా. శాంతియుతంగా ఓటింగ్ ప్రక్రియను నిర్వహించడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈస్ట్ బెహల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని పాయల్ సర్కార్ పిలుపునిచ్చారు.

  • 10 Apr 2021 07:30 AM (IST)

    పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన ఈసీ అధికారులు

    అలీపూర్‌దర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బూత్‌లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను ఈసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

  • 10 Apr 2021 07:28 AM (IST)

    భంగర్ నియోజకవర్గంలో బారులు తీరిన ఓటర్లు

    నాలుగోదశ పోలింగ్ సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 24 పరగణ జిల్లాలోని భంగర్ నియోజకవర్గం పోలింగ్ కేంద్రం వద్ద చేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్‌లో నిల్చున్నారు.

  • 10 Apr 2021 07:24 AM (IST)

    డోమ్‌జుర్ నియోెజకవర్గంలో బారులు తీరిన ఓటర్లు

    పశ్చిమ బెంగాల్‌లో నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి హౌరా డోమ్‌జుర్ అసెంబ్లీ నియోెజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రం ముందు ఓటర్లు భారీగా బారులు తీరారు.

Published On - Apr 10,2021 6:17 PM

Follow us
బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..
బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..
నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్