విజయవాడలో ఘోరం, తండ్రి(38).. కూతురు(10) ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య.. ‘ఐ నీడ్…’ అంటూ గోడపై రాతలు
Father and daughter committed suicide by hanging themselves : విజయవాడ సత్యనారాయణపురంలోగల శ్రీనగర్ కాలనీలో

Lover Attempt
Father and daughter committed suicide by hanging themselves : విజయవాడ సత్యనారాయణపురంలోగల శ్రీనగర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి జాగాన రవి (38), కూతురు గీత సహస్ర (10) బలవన్మరణానికి పాల్పడ్డారు. తండ్రి కూతుళ్లు ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయినట్టు తెలుస్తుంది. చనిపోయిన రవి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటారని సమాచారం. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్ధానికులు చెబుతున్నారు. అటు, కుటుంబ కలహాలు కూడా ఈ దుర్ఘటనకు కారణం కావొచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాల పై దర్యాప్తు చేస్తున్నారు.