Vijayawada Lockdown: విజయవాడలో మళ్లీ లాక్‌డౌన్ అంటూ ప్రచారం… క్లారిటీ ఇచ్చేసిన కలెక్టర్ ‌ఇంతియాజ్‌

మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. విజయవాడలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో బీహార్‌, తమిళనాడు, ఇతర ప్రాంతాల నుంచి...

Vijayawada Lockdown: విజయవాడలో మళ్లీ లాక్‌డౌన్ అంటూ ప్రచారం... క్లారిటీ ఇచ్చేసిన కలెక్టర్ ‌ఇంతియాజ్‌
Lockdown in ap
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 10, 2021 | 8:51 PM

మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. విజయవాడలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో బీహార్‌, తమిళనాడు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఇంటిబాట పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వేలాది మంది వలస కార్మికులు విజయవాడ, అమరావతి పరిసరాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య వందల్లోకి పడిపోయింది. గతంలో లాక్‌డౌన్‌ కారణంగా చాలా ఇబ్బందిపడ్డామని…ప్రస్తుతం ఆ పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నామని వలస కార్మికులు చెబుతున్నారు.

ఇప్పటికే చాలా మంది వలస కార్మికులు సొంత రాష్ట్రానికి వెళ్లిపోవడంతో కార్మికుల కొరత ఏర్పడింది. దీంతో విజయవాడలో భవనాల నిర్మాణంలో వేగం తగ్గిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. లాక్‌డౌన్‌పై దుష్ఫ్రచారం అస్సలు నమ్మొద్దని కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ చెప్పారు. కరోనా కేసులు పెరిగిన మాట వాస్తవమే కానీ..వాటి నివారణకు అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. లాక్‌డౌన్‌ విధిస్తారని తప్పుడు ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్‌ పెట్టే అవకాశం లేదని అధికారులు తేల్చారు.

ఏపీలో కరోనా కల్లోలం….

సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. రోజు రోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ వందల సంఖ్యలోనే నమోదైన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు ఏకంగా వేలకు చేరుకుంది. క్రమంగా ఆ సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం 2వేలకు పైగా కేసులు నమోదవగా.. ఇవాళ ఏకంగా 3వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన కొత్తగా 31,929 మంది నుంచి సాంపిల్స్ సేకరించగా.. 3,309 మందికి కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Also Read: భార్య ప్రేమతో లంచ్ చేస్తుంటే.. ఆఫీసులో అమ్ముకుంటున్న భర్త.. రీజన్ చాలా సిల్లీ..!

57 ఏళ్ల మహిళ 62 ఏళ్ల తన భర్తను పక్కా స్కెచ్ వేసి హతమార్చింది.. షాకింగ్ రీజన్.. ఇలా కూడా ఆలోచిస్తారా..?