AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: భార్య ప్రేమతో లంచ్ చేస్తుంటే… ఆఫీసులో అమ్ముకుంటున్న భర్త.. రీజన్ చాలా సిల్లీ..!

అందరూ హోమ్ ఫుడ్ కావాలనుకుంటారు. బయట ఫుడ్ తింటే హెల్త్ పాడువుతుందని ఆలోచిస్తారు. ఇంట్లో అద్భుతంగా వంట చేసే శ్రీమతి ఉంటే.. అంతకుమించి ఏం కావాలి...

Viral News: భార్య ప్రేమతో లంచ్ చేస్తుంటే... ఆఫీసులో అమ్ముకుంటున్న భర్త.. రీజన్ చాలా సిల్లీ..!
Man Selling Lunch Made By Wife
Ram Naramaneni
|

Updated on: Apr 10, 2021 | 8:14 PM

Share

అందరూ హోమ్ ఫుడ్ కావాలనుకుంటారు. బయట ఫుడ్ తింటే హెల్త్ పాడువుతుందని ఆలోచిస్తారు. ఇంట్లో అద్భుతంగా వంట చేసే శ్రీమతి ఉంటే.. అంతకుమించి ఏం కావాలి అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్య ఎంతో ప్రేమతో లంచ్ ప్యాక్ చేసి.. ఇస్తే దాన్ని అమ్ముకుంటున్నాడు. ఈ విషయం అనుకోకుండా ఆమెకు తెలిసిపోయింది. భర్త యవ్వారం తెలియడంతో కాళికాదేవిగా మారిపోయింది. ఇంకోసారి మీకు లంచ్ కాదు కదా కనీసం టీ కూడా ఇవ్వను అంటూ భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు సదరు పోస్ట్ సాామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

వైఫ్ అండ్ హస్బెండ్ డబ్బులు పొదుపుగా వాడుకుని కొత్త అపార్ట్‌మెంట్ కొనుక్కుందామని ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం తమ ఖర్చులను తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే భర్తకి ఫాస్ట్ ఫుడ్ అంటే విపరీతమైన ఇష్టం. దానికోసం రోజుకు సుమారు 20 డాలర్లు ఖర్చు చేస్తున్నాడు. ఆ ఖర్చుని… తగ్గించేందుకు అతని భార్య ఆయనకి లంచ్ ప్యాక్ చేసి పంపించేది. అయితే ఆమె లంచ్ బాక్స్‌లో పెట్టిన శాండ్‌విచ్‌లను భర్త ఆఫీస్‌లోని సహోద్యోగులకు అమ్మకానికి పెట్టేవాడు. ఆ వచ్చిన డబ్బులతో తనకిస్టమైన ఫాస్ట్‌ఫుడ్ తెప్పించుకుని లాగేంచేవాడు.

ఓ రోజు ఇంటికి డిన్నర్‌కి వచ్చిన భర్త కొలిగ్ నోరుజారి అసలు విషయం బయటపెట్టేశాడు. మీ శాండ్‌విచ్‌లు చాలా బాగుంటాయ్.. కానీ కాస్త రేటు ఎక్కువ అంటూ.. అంతలోనే నాలుక కరుచుకున్నాడు. దీంతో ఆళికి అసలు విషయం తెలిసిపోయి.. కాళికగా మారిపోయింది.  తను ప్రేమతో చేసిన లంచ్ ఆఫీస్‌లో అమ్మేస్తున్నాడని తెలిసి భార్య బాగా హర్టయ్యింది. జీవితంలో లంచ్ తయారుచేయనని అల్టిమేటం జారీ చేసింది. రెడిట్‌లో యు డానీ పేరుతో పెట్టిన ఈ పోస్ట్ తెగ సర్కులేట్ అవుతుంది.

Also Read: 57 ఏళ్ల మహిళ 62 ఏళ్ల తన భర్తను పక్కా స్కెచ్ వేసి హతమార్చింది.. షాకింగ్ రీజన్.. ఇలా కూడా ఆలోచిస్తారా..?

అక్కడి పరిపాలన మహిళలదే.. పురుషులకు కనీసం గుర్తింపు కూడా లేదు… ఈ విషయాలు తెలిస్తే మీ దిమ్మతిరుగుద్ది