అక్కడి పరిపాలన మహిళలదే.. పురుషులకు కనీసం గుర్తింపు కూడా లేదు… ఈ విషయాలు తెలిస్తే మీ దిమ్మతిరుగుద్ది
ఈ ప్రపంచంలోని చాలా దేశాల్లో పాలన పరంగా పురుషులు ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. అయితే, మారుతున్న కాలంతో ప్రజల ఆలోచన కూడా మారిపోయింది.
ఈ ప్రపంచంలోని చాలా దేశాల్లో పాలన పరంగా పురుషులు ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. అయితే, మారుతున్న కాలంతో ప్రజల ఆలోచన కూడా మారిపోయింది. ఇప్పుడు స్త్రీలు, పురుషులు సమాన స్థాయిల్లో రాణిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో మహిళలు పురుషుల కంటే ఒక అడుగు ముందుకేస్తున్నారు. కానీ, ఈ రోజు స్త్రీలు పరిపాలించే ప్రాతం గురించి మీకు చెప్పబోతున్నాం. ఆశ్చర్యకరంగా, ఇక్కడ పురుషులకు పౌరసత్వం కూడా ఇవ్వరు.
ఐరోపాలో ఉన్న ఈ దేశం పేరు ‘ఇతర ప్రపంచ రాజ్యం’ (Other World Kingdom). 1996 సంవత్సరంలో, చెక్ రిపబ్లిక్ నుంచి విడిపోయిన తరువాత ఈ దేశం ఏర్పడిందని చెబుతారు. ఈ దేశ పాలన మహిళల చేతుల్లో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. నివేదికల ప్రకారం, ఈ దేశాన్ని ప్యాట్రిసియా -1 పరిపాలిస్తున్నారు. అయితే ఇతర దేశాలు.. ఈ కంట్రీకి దేశ హోదా ఇవ్వలేదు. ఈ దేశానికి సొంత జెండా, కరెన్సీ, పోలీసు బలగం, ప్రత్యేక పాస్‌పోర్ట్ ఉన్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ దేశంలో పురుషులకు సిటిజన్‌షిప్ కూడా లేదు.
ఈ దేశంలో చాలా విచిత్రమైన చట్టాలు ఉన్నాయి…
ఒక నివేదిక ప్రకారం, ఈ దేశం నిర్మాణానికి రెండు మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఈ దేశ పౌరసత్వం పొందాలంటే, కనీసం ఐదు రోజులు రాణి ప్యాలెస్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో అతను రాణి యొక్క ప్రతి ఆదేశాన్ని పాటించాలి. ఇది మాత్రమే కాదు, బయటి ఎవరైనా ఈ దేశానికి వస్తే, సదరు వ్యక్తులు రాణి కూర్చునే సోఫాగా మారాలి. వారిపై ఆమె కూర్చుంటుంది. ఒక బానిస మద్యం తాగవలసి వస్తే, మొదట ఆ లిక్కర్‌ను రాణి పాదాల వద్ద ఉంచి ఆ తర్వాత మాత్రమే సేవించాలి.
Also Read: 73 ఏళ్ల వృద్ధ మహిళ వరుడు కావాలంటూ ప్రకటన.. ముందుకొచ్చిన 69 ఏళ్ల వ్యక్తి..!