పోలీస్ కుక్కలకి కూలర్లు.. మెరుగైన విచారణకు దోహదపడతాయని విజయనగరం జిల్లా ఎస్పీ కొత్త స్టెప్

Air coolers for Police dogs : విజయనగరం జిల్లా ఎస్పీ సరికొత్త ఆలోచన చేశారు.

  • Venkata Narayana
  • Publish Date - 7:11 pm, Sat, 10 April 21
పోలీస్ కుక్కలకి కూలర్లు..  మెరుగైన విచారణకు దోహదపడతాయని విజయనగరం జిల్లా ఎస్పీ కొత్త స్టెప్
Police Dogs

Air coolers for Police dogs : విజయనగరం జిల్లా ఎస్పీ సరికొత్త ఆలోచన చేశారు. పోలీస్ జాగిలాలకి చల్లదనం కోసం నాలుగు కూలర్లను ఏర్పాటు చేశారు. వేసవి నేపథ్యంలో రోజురోజుకీ ఎండ తీవ్రత పెరిగిపోతోన్న తరుణంలో ఎస్పీ రాజకుమారి ఈ స్టెప్ తీసుకున్నారు. కాగా, కరోనా మహమ్మారి చుట్టుముట్టుతున్న వేళ విజయనగరం జిల్లా ప్రజలను కరోనా బారిన పడకుండా అప్రమత్తం చేయ్యడంతో పాటు వలస కూలీలను తరలించడంలో విశిష్ట సేవలందించారు రాజకుమారి. మొదటి దఫా కరోనా విజృంభిస్తోన్న వేళ రాజకుమారి తన మానవత్వాన్ని పరిమళింప చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఎంతో మంది అన్నార్తుల దగ్గరకు అర్థరాత్రి వేళ నేరుగా వెళ్లి వండి పెట్టిమరీ వాళ్ల ఆకలి తీర్చారు రాజకుమారి. ఇలాంటి సంఘటనలు ఎస్పీ రాజకుమారి విషయంలో లెక్కకు మిక్కిలి. ఈ నేపథ్యంలోనే ఆమెకు అప్పట్లో అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో కోవిడ్ ఉమేన్ వారియర్ అవార్డును కేంద్ర మంత్రి జవదేకర్ చేతుల మీదుగా అందుకున్నారామే. తనకు లభించిన ఈ గౌరవానికి విజయనగరం జిల్లా ప్రజలు అందించిన సహకారమే కారణమని రాజకుమారి చెప్పడం ఆమె ఉన్నత వ్యక్తిత్వానికి, ఔన్నత్యానికి నిదర్శనం.

Read also : Breaking news : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తిరుపతి ఎంపీ బైపోల్‌ ప్రచార పర్యటన రద్దు.. బహిరంగ లేఖ రాసిన ముఖ్యమంత్రి