AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Dravid: నడిరోడ్డుపై రాహుల్ ద్రావిడ్ హల్‌చల్.. క్రికెట్‌ బ్యాట్‌తో కారు ధ్వంసం.. ‘గాంధీ నగర్‌కా గూండా’నంటూ..

Rahul Dravid Video Viral: రాహుల్ ద్రావిడ్ ఎంత ప్రశాంతంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ద్రావిడ్ చాలా సున్నితమైన వ్యక్తి అని అతని సన్నిహితులు...

Rahul Dravid: నడిరోడ్డుపై రాహుల్ ద్రావిడ్ హల్‌చల్.. క్రికెట్‌ బ్యాట్‌తో కారు ధ్వంసం.. ‘గాంధీ నగర్‌కా గూండా’నంటూ..
Rahul Dravid
Shiva Prajapati
|

Updated on: Apr 10, 2021 | 7:30 PM

Share

Rahul Dravid Video Viral: రాహుల్ ద్రావిడ్ ఎంత ప్రశాంతంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ద్రావిడ్ చాలా సున్నితమైన వ్యక్తి అని అతని సన్నిహితులు సహా అందరూ చెబుతుంటారు. కానీ, నాణానికి బొమ్మ, బొరుసు ఉన్నట్లుగానే.. ద్రావిడ్‌లోనూ మరో కోణం ఉంది. అవునూ.. ద్రావిడ్ కోపాన్ని మీరెప్పుడైనా చూశారా? ద్రావిడ్‌కు కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?.. కోపంలో అతను ఎంత వైల్డ్‌గా ప్రవర్తిస్తారో మీకు తెలుసా? రాహుల్ ద్రావిడ్‌లోని ఈ యాంగిల్‌ను మీరెప్పుడూ చూడనట్లయితే.. ఇప్పుడు చూసేయండి మరి. అవును.. రాహుల్ ద్రావిడ్‌కు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో నడిరోడ్డుపైనే రెచ్చిపోయాడు. ‘గాంధీ నగర్‌కా గూండా’ అంటూ విధ్వంసం సృష్టించాడు. బ్యాట్‌ చేతపట్టి హల్‌చల్ చేశాడు. తొలుత తన కారుపైనే కోపాన్ని ప్రదర్శించిన ద్రావిడ్.. ఆ తరువాత తన కారు పక్కన ఉన్నవారిని సైతం బెదిరించాడు. ‘నువ్ రారా బొక్కలు ఇరగదీస్తా..’ అంటూ ఊగిపోయాడు.. ఒక కారుకి సైడ్ మిర్రర్‌ను ధ్వంసం చేశాడు. రాహుల్ ద్రావిడ్ చర్యతో రోడ్డుపై ఉన్న వాహనదారులంతా హడలిపోయి గమ్మునుండిపోయారు.

హలో.. హలో.. కాసేపు ఆగండి. ఇక్కడ మరో బిగ్ ట్విస్ట్ ఉంది. రాహుల్ ద్రావిడ్ కోపం నిజం కాదులేండి. ఓ యాడ్ కోసం ద్రావిడ్ యాంగ్రీమెన్‌గా నటించాడు. ఆ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ యాడ్‌పై క్రికెట్ సెలబ్రిటీలతో పాటు.. సినీ ప్రముఖులు సైతం ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. క్రెడ్ యాప్‌ సంస్థ ఐపీఎల్ నేపథ్యంలో సరికొత్త యాడ్‌ను విడుదల చేసింది. ఈ యాడ్‌లో రాహుల్ ద్రావిడ్ నటించాడు. క్రెడ్ యాప్‌ ద్వారా చెల్లింపులు జరిపితే సదరు యూజర్లకు క్యాష్ బ్యాక్ సహా ఇతర ఆఫర్లు వస్తాయని, క్రెడ్ వినియోగించని క్రెడిట్ కార్డు యూజర్లు ద్రావిడ్‌లా ఆగ్రహానికి గురవుతారనే సందేశాన్ని చెబుతూ సదరు సంస్థ యాడ్ రూపొందించింది. ఈ యాడ్‌లో నటించిన రాహుల్ ద్రావిడ్ స్క్రిప్ట్ ప్రకారం చాలా కోపంతో ఊగిపోతాడు. అదీ అసలు కథ.

Virat Kohli Video:

అయితే, ఈ యాడ్‌పై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ కోహ్లీ.. ‘రాహుల్ భాయ్‌ని ఇలా ఎప్పుడూ చూడలేదు’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. కోహ్లీ ట్వీట్‌తో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది. దీనిపై క్రికెట్ సెలబ్రిటీలతో పాటు.. ప్రముఖులంతా స్పందిస్తున్నారు.