AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Remora Fish: ఆ చేప ఉండేది మూడు అడుగులే.. కానీ షార్క్‌కు ఎదురువెళ్తుంది.. దాని నోట్లోకి దూరి…

సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన చేపలలో సొరచేప ప్రధానమైనది. సముద్రంలోని చాలా జీవులు దాని కంట పడకుండా ఉండాలనుకుంటాయి. కానీ ఓ చేప మాత్రం సొర చేపతో డీల్ సెట్ చేసుకుంది....

Ram Naramaneni
|

Updated on: Apr 10, 2021 | 10:12 PM

Share
షార్క్ చేపలు ఎంత ప్రమాదకారులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చేప దాని బలానికి ప్రసిద్ది చెందింది. సముద్రపు జంతువులన్నీ ఈ చేపకు దూరంగా ఉంటూ.. తమ ప్రాణాలను దక్కించుకుంటాయి. అయితే సముద్రంలో ఒక చేప.. సొరకు ఎదురు వెళ్తుంది. అంతే కాదు, ఇది సొరచేపలకు భయపడకుండా, దానితో కలిసి తిరుగుతుంది.

1 / 5
మేము మాట్లాడేది రిమోరా జాతి చిన్న చేపల గురించి. ఈ చోటా చేపలు.. షార్క్ చేపలను శుభ్రపరుస్తాయి. అందుకు ప్రతిఫలంగా షార్క్..  దానికి ఆహారాన్ని అందిస్తుంది. పనిలో పనిగా షార్క్‌తో కలిసి రిమోరా ఓ రైడ్‌కి వెళ్తుంది.

2 / 5

రిమోరా చేప సగటు పొడవు ఒకటి నుంచి మూడు అడుగుల మధ్య ఉంటుంది. దాని తల పైన, ఒక అవయవం వ్యాక్యూమ్ కప్పు లాగా తయారవుతుంది. రిమోరా చేప సొరచేపకు అటాచ్ అయ్యేందుకు దాన్ని ఉపయోగిస్తుంది.

3 / 5
రిమోరా చేపలు సాధారణంగా షార్క్ బొడ్డు దిగువ భాగంలో అంటుకుంటాయి. ఈ చేపల సంబంధాన్ని GIVE AND TAKE పాలసీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే రిమోరాలు... సొరచేపలు తినగా మిగిలిపోయిన ఆహారాన్ని ఆరగిస్తాయి.

4 / 5
రిమోరా షార్క్ నోట్లోకి వెళ్లి దంతాల మధ్య చిక్కుకున్న మాంసాన్ని తింటుంది. ఈ ప్రక్రియ వల్ల రెండు చేపలకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీనివల్ల షార్క్ బ్రష్ చేయవలసిన అవసరం లేదు. రిమోరాకు ఆహారాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు.

5 / 5