AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగూల్‌ మ్యాప్ ఫాలో వల్ల పెళ్లికొడుకు తారుమారు..! రాంగ్‌ అడ్రస్‌కి వెళ్లి నవ్వుల పాలు.. వైరల్‌ అవుతున్న వీడియో..

Google Map Showing Wrong Address : సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒక్కోసారి సరిగ్గా పనిచేయదని నెదర్లాండ్‌లో జరిగిన సంఘటన చూస్తే తెలుస్తోంది. గూగుల్‌ మ్యాఫ్ ఫాలో అయిన పెళ్లికొడుకుకి వింత అనుభవం ఎదురైంది.

గూగూల్‌ మ్యాప్ ఫాలో వల్ల పెళ్లికొడుకు తారుమారు..! రాంగ్‌ అడ్రస్‌కి వెళ్లి నవ్వుల పాలు.. వైరల్‌ అవుతున్న వీడియో..
Google Map Showing Wrong Ad
uppula Raju
|

Updated on: Apr 11, 2021 | 5:29 AM

Share

Google Map Showing Wrong Address : సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒక్కోసారి సరిగ్గా పనిచేయదని నెదర్లాండ్‌లో జరిగిన సంఘటన చూస్తే తెలుస్తోంది. గూగుల్‌ మ్యాఫ్ ఫాలో అయిన పెళ్లికొడుకుకి వింత అనుభవం ఎదురైంది. తనది కాని వేడుకకు వెళ్లి అవమానం ఎదుర్కోవలసి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీవితంలో టెక్నాలజీ వల్ల చాలా పనులు సులువుగా జరుగుతున్నాయి. అయితే ఇదే టెక్నాలజీ ఒక్కోసారి ఇబ్బందులకు కూడా గురిచేస్తుంది. ఇండోనేషియాలో పెళ్లిరోజున ఓ వరుడికి ఇలాంటిదే జరిగింది. వధువు ఇంటికి బయలుదేరిన పెళ్లికొడుకు, అతడి కుటుంబ సభ్యులు అడ్రస్‌ కోసం గూగూల్‌ మ్యాఫ్ ఫాలో అయ్యారు. గూగూల్‌ మ్యాప్‌ రాంగ్‌ అడ్రస్ చూపించడంతో నేరుగా దగ్గర్లో జరగుతున్న మరో వివాహ వేడుకకు వెళ్లారు.

సరిగ్గా అదే సమయంలో వరుడి కోసం ఎదురుచూస్తున్న అక్కడి పెళ్లివారు వీరే వారనుకొని ఆహ్వానించి లోపలికి తీసుకెళుతారు. రిసెప్షన్‌పై వరుడిని కూర్చోబెట్టి మర్యాదలు చేస్తుంటారు. వధువు అలంకరణలో బిజీగా ఉండటంతో ఇంకా వరుడి దగ్గరికి రాకుండా ఉంటుంది. ఇంతలో పెళ్లికూతురు తల్లిదండ్రులు వేరే వ్యక్తి పెళ్లికొడుకుగా ఉండటం చూసి షాక్ అవుతారు. వారిని చూసిన పెళ్లికొడుకు కూడా ఆశ్చర్యపోతాడు దీంతో జరిగిన విషయం ఇరు కుటుంబాలకు అర్థమవుతుంది. దీంతో ఆ పెళ్లికొడుకు, అతడి కుటుంబ సభ్యులు ఆ పెళ్లి పెద్దలకు క్షమాపణలు చెప్పి..వారి సామాను పట్టుకొని అక్కడి నుంచి అసలైన వధువు ఇంటికి బయలుదేరుతారు. గూగుల్‌ మ్యాప్ ఫాలో అవడం వల్ల జరిగిన అనర్థం ఇది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Warangal Rural: వరంగల్‌లో హడలెత్తిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. రంగంలోకి దిగిన వైద్యులు.. చివరికి ఏం తేలిందంటే..

ఆసియా క్వాలిఫయర్స్​లో అదరగొట్టిన భారత మహిళా రెజ్లర్లు.. టోక్యో ఒలింపిక్స్‌లో బెర్తులు ఖరారు

చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ.. శిఖర్‌ ధావన్‌ దాడికి చతికిలపడిన సీఎస్‌కే బౌలర్లు.. రాణించిన పృథ్వీ షా..