AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హృదయ విదారకం.. పిల్లలు లేరు.. 30 ఏళ్ల క్రితమే భార్య సమాధి పక్కన తన సమాధి సైతం నిర్మించుకున్న వైనం

వివాహ సమయంలో కలకాలం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తారు. కష్ట సుఖాల్లో కడదాకా కలిసుంటానని బాసలు చేశాడు. కానీ తన భార్య కాలం చేయడంతో....

హృదయ విదారకం.. పిల్లలు లేరు.. 30 ఏళ్ల క్రితమే భార్య సమాధి పక్కన తన సమాధి సైతం నిర్మించుకున్న వైనం
Burial Ground
Ram Naramaneni
|

Updated on: Apr 10, 2021 | 8:02 PM

Share

వివాహ సమయంలో కలకాలం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తారు. కష్ట సుఖాల్లో కడదాకా కలిసుంటానని బాసలు చేశాడు. కానీ తన భార్య కాలం చేయడంతో ఆ చేసిన బాసలకు కట్టుబడి భార్య సమాధి పక్కనే తన సమాధి కూడా చనిపోకముందే నిర్మించుకొని రెడీగా పెట్టుకున్నాడు ఓ వృద్ధుడు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన బాలసాని మల్లయ్య అనే వృద్ధుడు ఒకప్పుడు గొప్పగానే బతికాడు.కానీ ఏవో కారణాలతో ఆస్తులన్నింటినీ కోల్పోయాడు. ప్రస్తుతం తినడానికి తిండి కూడా లేకపోవడంతో కొందరు దాతలు నిత్యం భోజనం పెట్టి, ఆ వృద్ధుడి ఆకలి తీరుస్తున్నారు. అయితే మల్లయ్య భార్య రాజమ్మ 38ఏళ్ల క్రితమే చనిపోయింది. అప్పుడు మల్లయ్య తన భార్య దహన సంస్కారాలు చేశాడు. అయితే వారికి సంతానం లేక పోవడంతో తనకు దహన సంస్కారాలు ఎవరు చేస్తారని భావించిన మల్లయ్య… తన భార్య సమాధి పక్కనే ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితమే..తనకు ఓ సమాధిని నిర్మించుకొని, దానినిండా ఇసుక నింపి రెడీగా పెట్టుకున్నాడు మల్లయ్య.

అయితే, గత ఐదేళ్ల క్రితం..మల్లయ్యను కరీంనగర్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఉంచారు గ్రామస్థులు. ఆశ్రమంలో కొందరు కాలం చేయడంతో మల్లయ్యకు భయమేసి వృద్ధాశ్రమం నుంచి పారిపోయి సొంతూరికి వచ్చేశాడు. తను చనిపోతే కరీంనగర్‌లోనే అంత్యక్రియలు చేస్తారేమోనని ఆందోళన చెందాడు. తన భార్య సమాధి పక్కనే నిర్మించుకున్న సమాధిలోనే తనను పూడ్చిపెట్టాలని గ్రామస్తులకు ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు, ఈ వృద్ధుడి విషయం తెలుసుకున్న తర్వాత వారంతా మల్లయ్యను కంటికిరెప్పలా కాపాడుతున్నారు. అయినవారే కన్నతల్లిదండ్రులకు అన్నం పెట్టని ఈ రోజుల్లో ఏమీ కాని ఒక అనాధను చేరదీసి మూడు పూటలా అన్నం పెట్టి ఆదరిస్తున్నారు దాతలు.

Old Man Self Burial Ground

Old Man Self Burial Ground

Also Read: 57 ఏళ్ల మహిళ 62 ఏళ్ల తన భర్తను పక్కా స్కెచ్ వేసి హతమార్చింది.. షాకింగ్ రీజన్.. ఇలా కూడా ఆలోచిస్తారా..?

భార్య ప్రేమతో లంచ్ చేస్తుంటే.. ఆఫీసులో అమ్ముకుంటున్న భర్త.. రీజన్ చాలా సిల్లీ..!