Neck Pain: నిద్రలో మెడ పట్టుకుందా ? అయితే ఇలా చేయండి.. త్వరగా ఉపశమనం లభిస్తుంది..
Neck Pain In Sleeping: సాధారణంగా చాలా మందికి నిద్రలో మెడ పట్టుకోవడం, మెడ ఇరుకుపట్టేయడం జరుగుతుంటుంది. దీంతో వారు మరునాడు తలను పక్కకు
Neck Pain In Sleeping: సాధారణంగా చాలా మందికి నిద్రలో మెడ పట్టుకోవడం, మెడ ఇరుకుపట్టేయడం జరుగుతుంటుంది. దీంతో వారు మరునాడు తలను పక్కకు కదపలేని స్థితికి చేరుకుంటారు. అంతేకాదు.. కాస్తా తలను పక్కకు తిప్పిన నొప్పి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వారు రోజంతా ఏ పని చేయలేరు. ఇక ఆ నొప్పిని తగ్గించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ సమస్య ఎన్ని రోజులు ఉంటుందనేది చెప్పడం కష్టం.. కొంతమందికి ఒక్కరోజులో తగ్గిపోతుంది. అలాగే మరికొంత మందికి రోజుల తరబడి ఉంటుంది. ఇక కొంతమంది ఈ నొప్పిని భరించలేక తాత్కలిక ఉపశమనం కోసం టాబ్లెట్స్ మింగేస్తుంటారు. అయితే కొన్ని చిన్న టిప్స్ ఫాలో అవడం వలన ఈ మెడ నొప్పి నుంచి ఉపశమం పొందవచ్చు అవెంటో తెలుసుకుందామా.
నిద్రలో మెడ పట్టుకున్నప్పుడు మరునాడు ఉదయం వెంటనే తలను అటు ఇటు గట్టిగా తిప్పే ప్రయత్నం చేయకూడదు. మెడ నొప్పిని తగ్గించుకోవడం కోసం హీట్ ప్యాక్ అంటే వేడికాపడం పెట్టాలి. దీని తర్వాత మెడ పై కోల్డ్ ప్యాక్ అంటే ఐస్ ముక్కలను టవల్లో చుట్టి కాపడంలా కొద్ది సమయం వరకు పెడుతూ ఉండాలి. ఇలా మెడలు పట్టుకున్న చోట గానీ లేదా మరేచోటనైనా అంటే వాపు కనిపించిన ప్రదేశంలో పెడుతూ ఉండాలి. ఇవే కాకుండా.. కొంతమందికి మెడ నొప్పితోపాటు మెడంతా ఎర్రబారడం, వాపు రావడం జరుగుతుంది. అయితే ఇలాంటి లక్షణాలను కనిపించినప్పుడు వేడికాపడం పెట్టడం కంటే కోల్డ్ ప్యాక్ చాలావరకు అధ్బుతంగా పనిచేస్తుంది. ఇలా హీట్ ప్యాక్, ఐస్ ప్యాక్లను కొద్ది సమయం వరకు మార్చి మార్చి ఇస్తూ ఉండాలి. ఇలా చేస్తున్న సమయంలో మధ్యమధ్యలో నొప్పి రానంతవరకు మెడను నెమ్మదిగా అటు ఇటు పక్కలకు కదిలిస్తూ.. వంచాలి. కానీ ఈ సమయంలో ముందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వంచకూడదు. ఇవే కాకుండా మీరు కూర్చున్నప్పుడు గానీ, నిల్చున్నప్పుడు కానీ లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ మెడను నిటారుగానే ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా హీట్ ప్యాక్, ఐస్ ప్యాక్ పెడుతూ.. కాస్త మెడను కదల్చడం వలన మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. కానీ గుర్తుపెట్టుకోండి.. మెడనొప్పి ఉన్నప్పుడు మెడను ఎట్టిపరిస్థితుల్లో గుండ్రంగా తిప్పకూడదు.
Also Read: Health Tips: మరింత ఉత్సాహంగా.. ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని సులభమైన టిప్స్ పాటించండి..