Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం.. కొనసాగుతున్న ఆపరేషన్..

Shopian Encounter: జమ్మూకాశ్మీర్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. జమ్మూలోని షోపియాన్‌ జిల్లా

  • Shaik Madarsaheb
  • Publish Date - 9:07 am, Sun, 11 April 21
Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం.. కొనసాగుతున్న ఆపరేషన్..
Encounter

Shopian Encounter: జమ్మూకాశ్మీర్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. జమ్మూలోని షోపియాన్‌ జిల్లా హాదిపొరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, రాష్ట్ర పోలీసులు శనివారం సాయంత్రం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. అనంతరం భద్రతా దళాలు అప్రమత్తమై ఉగ్రవాదులకు ధిటుగా సామాధానమిచ్చారు. నిన్న రాత్రి నుంచి ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భదత్రా బలగాల కాల్పుల్లో నిన్న ఒక ఉగ్రవాది హతమవ్వగా.. ఆదివారం తెల్లవారుజామున మరో ఇద్దరిని మట్టుబెట్టినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. కాగా.. టెర్రరిస్టులు ఏ సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది.

కాగా ఈ ఉగ్రవాదుల్లో ఒకరు కొత్తగా చేరిన యువకుడు ఉన్నాడని, అతన్ని లొంగిపోవాల్సిందిగా కోరామని పోలీసులు వెల్లడించారు. అతని తల్లి దండ్రులు కూడా లొంగిపోవాలని అభ్యర్థించారని పేర్కొన్నారు. కానీ మిగిలిన టెర్రరిస్టులు లొంగిపోవడానికి అనుమతించలేదని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. వారం నుంచి జమ్మూ కాశ్మీర్‌లో భారీగా ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం షోపియాన్‌ టౌన్‌లో జరిగిన ఎదురుకాల్పులు కాల్పుల్లో ముగ్గురు, పుల్వామాలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Also Read:

Maoist Tension: తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ మావోయిస్టు టెన్షన్.. తెలంగాణలో పోలీసులు అలర్ట్.. ఏజెన్సీలోను అంతే

57 ఏళ్ల మహిళ 62 ఏళ్ల తన భర్తను పక్కా స్కెచ్ వేసి హతమార్చింది.. షాకింగ్ రీజన్.. ఇలా కూడా ఆలోచిస్తారా..?