Double Murder: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కాపురానికి రావడం లేదని భార్యను, పంపడం లేదని అత్తను..

Double Murder Case: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కాపురానికి రావడం లేదని భార్యను, పంపడం

Double Murder: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కాపురానికి రావడం లేదని భార్యను, పంపడం లేదని అత్తను..
Double Murder
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 11, 2021 | 10:09 AM

Double Murder Case: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కాపురానికి రావడం లేదని భార్యను, పంపడం లేదని అత్తను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని గాంధీనగర్‌ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలక్ట్రీషియన్‌ నర్సింహ దంపతులు గాంధీ నగర్ కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య స్వరూప పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది.

ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నర్సింహ తన భార్య స్వరూప (32), అత్త ఎల్లమ్మ (55)పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో స్వరూప, ఎల్లమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరీశీలించి పలు వివరాలను సేకరించారు.

హత్యకు గల కారణాలను సేకరిస్తున్నామని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. నిందితుడు నర్సింహా పోలీస్ స్టేషన్ లో లొంగి పోయినట్లు తెలుస్తోంది. అయితే.. చనిపోయిన స్వరూప ఇటీవలే విడాకులు కావాలని భర్తకు నోటీసులు పంపినట్టు సమాచారం.

Also Read:

Bank holidays April 2021: బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవు.. ఎప్పటినుంచి.. ఎప్పటివరకంటే..?

Accident: ఆలయానికి వెళుతుండగా.. లోయలోకి దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది దుర్మరణం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!