Symptoms of coronavirus: వాసన రాకపోవడం, రుచి తెలియకపోవడమే కాదు.. ఇవీ కూడా కరోనా వ్యాధి లక్షణాలే..
Symptoms of coronavirus: కరోనా వైరస్ మానవాళిని ఎంతలా భయపెట్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం.. సోషల్ డిస్టెన్స్...
Symptoms of coronavirus: కరోనా వైరస్ మానవాళిని ఎంతలా భయపెట్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం.. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం. ఇలా చేస్తే ఒకరి నుంచి మరొకరికి కరోను సోకకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా సోకిన వ్యక్తి వెంటనే అలర్ట్ అయ్యి తనకు తాను సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని చెబుతున్నారు. మరి మనకు కరోనా సోకిందా లేదో కొన్ని రకాల వ్యాధి లక్షణాల ఆధారంగా తెలుసుకుంటున్నాం. వీటిలో దగ్గు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి ప్రధానమైతే. నోటిలో జరిగే మార్పుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వీటిలో వాసన గుణాన్ని కోల్పోవడం, రుచి తెలియకపోవడం వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నోటి లక్షణాలే కాకుండా మరో రెండు లక్షణాలు కూడా కరోనా సోకిన వారిలో కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. కరోనా బారిన పడిన వారిలో సగం మందిలో ఈ నోటి సంబంధిత కొత్త రకం లక్షణాలు కనిపిస్తున్నాయని తేలింది. అవేంటంటే..
నోరు ఎండిపోవడం..
చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్లలో నోరు ఎండిపోవడం అనే లక్షణం కనిపిస్తుంది. తాజాగా జరిగిన అధ్యయనాల్లో కోవిడ్19 వైరస్ సోకిన వారిలోనూ ఈ లక్షణం కనిపించినట్లు తేలింది. నోరు ఎండిపోవడం వల్ల బ్యాక్టీరియా నుంచి మనల్ని కాపాడే లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది. నోరు ఎండిపోవడం వల్ల లాలాజం చాలా గట్టిగా మారుతుంది. దీనివల్ల ఆహారాన్ని నమలడం ఇబ్బందిగా మారడంతో పాటు మాట్లాడడం కూడా కష్టంగా మారుతుంది.
నోటిలో గాయాలు..
తాజా పరిశోధనల్లో తేలిన వివరాల ప్రకారం కోవిడ్19 బారిన పడిన వారు నోటిలో మండుతోన్న భావన కలుగుతున్నట్లు గుర్తించారు. వైరస్ నోటిలోని కండరాలతో పాటు నోటి చివర్లపై దాడి చేసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇది క్రమేణా నోటిలో గాయాలుగా మారడానికి దారి తీస్తుంది.. దీంతో ఆహారం తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. కొంతమందిలో ఇది నోటి పూతకు కూడా కారణంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Covid-19: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ.. లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన చేసిన సీఎం కేజ్రీవాల్
Bank holidays April 2021: బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవు.. ఎప్పటినుంచి.. ఎప్పటివరకంటే..?