Railways On Fake Video: ఆ ఫేక్ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇండియన్ రైల్వే.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
Railways On Fake Video: ఓవైపు కరోనా విజృంభణ కారణంగా భయాందోళన పరిస్థితులు నెలకొని ఉంటే మరోవైపు ఆకతాయిలు ఇదే అదునుగా సోషల్ మీడియాలో తన పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గతేడాది..
Railways On Fake Video: ఓవైపు కరోనా విజృంభణ కారణంగా భయాందోళన పరిస్థితులు నెలకొని ఉంటే మరోవైపు ఆకతాయిలు ఇదే అదునుగా సోషల్ మీడియాలో తన పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో ఉన్న పరిస్థితులకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను తాజావీ అన్నట్లు పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో జనాలు అనవసరంగా భయానికి గురవుతున్నారు. దేశ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల మళ్లీ లాక్‌డౌన్ అంటూ ఫేక్ జీవోను తయారు చేసిన ఓ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌లో (CSMT) భారీగా జనాలు చేరినట్లు ఉన్న ఓ ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే గత కొద్ది రోజులుగా రైల్వే స్టేషన్‌లో అలాంటి పరస్థితులే లేవు. ఒక్కసారిగా జనాలు గుమిగూడడంతో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా? అన్న ప్రశ్నలు, భయాందోళనాలు ఈ వీడియో కారణంగా ప్రజల్లో వచ్చాయి. దీంతో ఈ వీడియోపై సెంట్రల్ రైల్వే.. గవర్నమెంట్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియో కేవలం ప్రజల్లో భయాందోళనలకు పెంచడానికి తయారు చేసింది. ఇది ముమ్మటికీ ఫేక్ వీడియోనే అని అధికారులు తెలిపారు. ‘CSMTలో భారీగా ప్రయాణికులు చేరారంటూ ఏప్రిల్ 7 నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. పాత వీడియోనే కొత్తగా జరిగినట్లు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ ఫేక్ వీడియోపై వెంటనే విచారణ చేపట్టి.. నిందుతులపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని’ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముంబయి పోలీస్ చేసిన ట్వీట్..
A fake video showing huge gathering of passengers awaiting an outbound train at CSMT is making rounds on social media. We urge Mumbaikars to not panic.
All COVID-prevention norms are being followed by passengers at CSMT & all railway platforms across the city.#FakeNewsAlert pic.twitter.com/vA14W9dG5b
— Mumbai Police (@MumbaiPolice) April 9, 2021
Also Read: Covid-19 Vaccine: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా..
Prabhas: నెట్టింట చక్కర్లు కొడుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ రేర్ ఫోటో.. ఆనందంలో అభిమానులు
Maharastra Covid Update : మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?