AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: నెట్టింట చక్కర్లు కొడుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ రేర్ ఫోటో.. ఆనందంలో అభిమానులు

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. బాహుబలి, సాహో సినిమాలతో మనదగ్గరే కాదు అన్ని భాషల్లో  విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

Prabhas: నెట్టింట చక్కర్లు కొడుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ రేర్ ఫోటో.. ఆనందంలో అభిమానులు
Prabhas 1
Rajeev Rayala
|

Updated on: Apr 11, 2021 | 12:33 PM

Share

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. బాహుబలి, సాహో సినిమాలతో మనదగ్గరే కాదు అన్ని భాషల్లో  విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టి చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న రాదేశ్యామ్ సినిమాను పూర్తి చేసిన డార్లింగ్. ఆతర్వాత కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓ రౌత్ తో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో సినిమాలను లైన్ లో పెట్టాడు. ఈ క్రమంలోనే తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే తాజాగా ప్రభాస్ రేర్ ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. గతంలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాను విశ్వమిత్ర క్రియేషన్స్ పై నిర్మించారు. ఈ బ్యానర్ లోగో కోసం విశ్వమిత్రుడి గెటప్ అవసరమైంది.. ఆ గెటప్ కు ప్రభాస్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని భావించిన జక్కన్న ప్రభాస్ ను విశ్వమిత్రుడిగా మార్చాడు. ఆ సమయంలో ప్రభాస్ విశ్వ మిత్రుడిగా ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే రాజమౌళి ఈ బ్యానర్ లో ‘యమదొంగ’ తర్వాత మరో సినిమాని నిర్మించలేదు. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్  సినిమాతో జక్కన్న చాలా బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Prabhas

Prabhas

మరిన్ని ఇక్కడ చదవండి : 

థియేటర్లో నిల్చున్న ‘వకీల్ సాబ్’ హీరోయిన్… కరోనా తగ్గిందా అంటున్న ఆడియన్స్.. ‘మాటల్లేవ్’ అంటున్న నివేధా..

Vakeel Saab Movie: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ‘వకీల్‌ సాబ్’కు షాక్.. కీలక తీర్పునిచ్చిన ధర్మాసనం..

Chavu Kaburu Challaga: ఓటీటీలోకి మరో యంగ్ హీరో సినిమా.. ఆ తేదీన రానున్న ‘చావు కబురు చల్లగా’…