AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థియేటర్లో నిల్చున్న ‘వకీల్ సాబ్’ హీరోయిన్… కరోనా తగ్గిందా అంటున్న ఆడియన్స్.. ‘మాటల్లేవ్’ అంటున్న నివేధా..

Vakeel Saab: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా సంచలనం సృష్టిస్తూ.. రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమాకు

థియేటర్లో నిల్చున్న 'వకీల్ సాబ్' హీరోయిన్... కరోనా తగ్గిందా అంటున్న ఆడియన్స్.. 'మాటల్లేవ్' అంటున్న నివేధా..
Niveda Thomas
Rajitha Chanti
|

Updated on: Apr 10, 2021 | 9:45 PM

Share

Vakeel Saab: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా సంచలనం సృష్టిస్తూ.. రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక పవన్ అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్‏ను స్క్రీన్ పై చూడడంతో అభిమానులు సంబరాలు మాములుగా లేవు. డైరెక్టర్ క్రిష్ చెప్పినట్లుగానే టాలీవుడ్ మొత్తం ఇప్పుడు పవన్ ఫెస్టివల్ నడుస్తుంది. అగ్రహీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ ఇలా ప్రతి ఒక్కరు వకీల్ సాబ్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వకీల్ సాబ్ విడుదలకు ముందుగానే ఈ చిత్రానికి కరోనా భయం తగిలింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ నివేధా థామస్‏కు వకీల్ సాబ్ విడుదలకు కొన్ని రోజుల ముందే కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వకీల్ సాబ్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నివేధా క్యారంటైన్‏లో ఉన్నా కానీ.. సోషల్ మీడియా ద్వారా సినిమా గురించి స్పందిస్తూ వస్తుంది. ఇక నిన్న విడుదలైన ఈ సినిమాపైనే ఈ అమ్మడి ద్యాస అంతా ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటుంది నివేధా.

అయితే ఇన్ని రోజులు క్యారంటైన్లో ఉన్న నివేధా థామస్ తాజాగా బయటకు వచ్చింది. అయితే ప్రేక్షకులతో హౌస్ ఫుల్ అయిన థియేటర్లో.. ఓ పక్కన చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి.. ఎవరకి తగకుండా నిల్చోని సినిమాను చూసింది నివేధా. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఆమె నిల్చున్న ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ క్షణం కోసమే చూస్తూన్నాను.. మాటలు లేవు అంటూ ట్వీట్ చేసింది. వకీల్ సాబ్ సినిమాలో నివేధా థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రలో నటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్‏గా నటించగా.. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే.. కరోనాతో ఇప్పటివరకు వకీల్ సాబ్ ప్రమోషన్స్‏లో ఎక్కడా కనిపించని నివేధా తాజాగా థియేటర్లో కనిపించడంతో.. అడియన్స్ షాక్ అయ్యారు. ఇంత త్వరగా కరోనా నుంచి కోలుకుందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నివేధా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే సినిమా వీక్షించినట్లు తెలుస్తోంది.

ట్వీట్..

Also Read: Chavu Kaburu Challaga: ఓటీటీలోకి మరో యంగ్ హీరో సినిమా.. ఆ తేదీన రానున్న ‘చావు కబురు చల్లగా’…