Covid-19 Vaccine: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా..

India Coronavirus Vaccination Updates: దేశంలో ఓ వైపు కరోనా విజృంభిస్తోంది.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో

Covid-19 Vaccine: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా..
Coronavirus Vaccination
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 11, 2021 | 7:30 AM

India Coronavirus Vaccination Updates: దేశంలో ఓ వైపు కరోనా విజృంభిస్తోంది.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్ వ్యాక్సినేషన్ విషయంలో సరికొత్త రికార్డును సృష్టించింది. అత్యంత వేగంగా 10 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసిన దేశంగా భారత్ మరో ఘనతను సాధించింది. అయితే భారత్ ఈ ఘనతను కేవలం 85 రోజుల్లోనే సాధించింది. అమెరికా, చైనా 85 రోజుల్లో వరుసగా 9.2 కోట్లు, 6.1 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్లు ఇచ్చాయని.. కానీ భారత్ 10 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.10 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి అమెరికాకు 89 రోజులు పట్టగా, చైనాకు 102 రోజులు పట్టింది.

దేశంలో.. జనవరి 16 న వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ముందుగా.. ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు. ప్రస్తుతం వ్యాక్సినేష‌న్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. నిత్యం లక్షలాది మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ తరుణంలో… కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ వ్యాక్సిన్ కొర‌త ఉన్నట్లు వార్తలు వ‌స్తుండంటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు తీసుకుంటుంది.

Also Read:

Indonesia Earthquake: ఇండోనేషియాను వణికిస్తున్న విపత్తులు.. భారీ భూకంపం.. ఆరుగురు మృతి

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!