కత్తితో 25 సార్లు కసితీరా పొడిచాడు..! ఎవరినో కాదు సొంత భార్యనే.. ఎందుకో తెలుసా..?

Man Stabs Wife 25-Times : దేశ రాజధాని ఢిల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఇప్పుడు

  • uppula Raju
  • Publish Date - 5:30 am, Sun, 11 April 21
కత్తితో 25 సార్లు కసితీరా పొడిచాడు..! ఎవరినో కాదు సొంత భార్యనే.. ఎందుకో తెలుసా..?
Young Man Brutal Murder

Man Stabs Wife 25-Times : దేశ రాజధాని ఢిల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన హరీశ్‌, భార్యతో కలిసి బుధ్‌ విహార్‌ ప్రాంతంలో మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా అతడు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని వేధించసాగాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం భార్యభర్తల మధ్య దీనికి సంబంధించి వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో కోపోద్రిక్తుడైన హరీశ్‌.. భార్యపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె భర్త నుంచి తప్పించుకోవడం కోసం నుంచి బయటకు పరిగెత్తింది.

వెంబడించిన హరీశ్‌.. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. సుమారు 26 సార్లు భార్యను కత్తితో పొడిచాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. దాంతో హరీశ్‌ ‘‘దగ్గరకు రావద్దు.. వస్తే మీకు ఇదే గతి పడుతుందని’’ హెచ్చరిస్తూ.. తన దుశ్చర్యను కొనసాగించాడు. భార్య మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హరీశ్‌పై కేసు నమోదు చేశారు.

Dead Whale : బంగ్లాదేశ్ సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చిన 35 అడుగుల చనిపోయిన తిమింగలం

చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ.. శిఖర్‌ ధావన్‌ దాడికి చతికిలపడిన సీఎస్‌కే బౌలర్లు.. రాణించిన పృథ్వీ షా..

ఆసియా క్వాలిఫయర్స్​లో అదరగొట్టిన భారత మహిళా రెజ్లర్లు.. టోక్యో ఒలింపిక్స్‌లో బెర్తులు ఖరారు

Warangal Rural: వరంగల్‌లో హడలెత్తిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. రంగంలోకి దిగిన వైద్యులు.. చివరికి ఏం తేలిందంటే..