Covid-19: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ.. లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన చేసిన సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేలాది కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీలో

Covid-19: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ.. లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన చేసిన సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 11, 2021 | 8:26 AM

Arvind Kejriwal: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేలాది కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీలో కూడా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే కేజ్రీవాల్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించి.. కోవిడ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. దీంతో ఢిల్లీలో లాక్‌డౌన్ విధిస్తారన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో లాక్‌డౌన్ విధించ‌బోమ‌ని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. అయితే క‌రోనా నివార‌ణ‌కు కొత్త ఆంక్షలు అమ‌లు చేస్తామ‌ని ప్రకటించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో క‌రోనా ఫోర్త్ వేవ్ కొన‌సాగుతుంద‌న్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏడు నుంచి ప‌ది రోజుల‌కు స‌రిపడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంద‌ని.. ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్లను పంపిణీ చేస్తే.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. మరిన్ని టీకా కేంద్రాలను ప్రారంభించి డ్రైవ్‌ను వేగంగా నిర్వహిస్తామని కేజ్రీవాల్ కేంద్రానికి తెలిపారు. కరోనా తీవ్ర వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలను విధించింది. బహిరంగ సభలను నిషేధించడం, రెస్టారెంట్లు, థియేటర్లు, ప్రజా రవాణా, శుభకార్యాలు వంటి కార్యక్రమాలకు పరిమితులను విధించింది.

ఈ కొత్త నియమాలు ఏప్రిల్ 30 వరకు ఉంటాయని.. రాత్రివేళ కర్ఫ్యూ కొనసాగుతుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలో వివాహా కార్యక్రమాలకు 50 మందిని మాత్రమే అనుమతిస్తారు. దీంతోపాటు రెస్టారెంట్లు, బార్‌లు, థియేటర్లు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో పనిచేస్తాయి. బస్సులు, మెట్రోల్లో సీట్లకు అనుగుణంగా అనుమతించనున్నారు.

Also Read:

Virginity Test: అరాచకానికి పరాకాష్ట.. కన్యత్వ పరీక్షల్లో విఫలమయ్యారని అక్కా చెల్లెళ్ల గెంటివేత.. ఎక్కడంటే..?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో