Virginity Test: అరాచకానికి పరాకాష్ట.. కన్యత్వ పరీక్షల్లో విఫలమయ్యారని అక్కా చెల్లెళ్ల గెంటివేత.. ఎక్కడంటే..?

Jaat Panchayat: ఆధునిక ప్రపంచం అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. సైన్స్ దినదినాభివృద్ధి జరుగుతోంది. ఈ క్రమంలో కూడా అనుమానాలు,

Virginity Test: అరాచకానికి పరాకాష్ట.. కన్యత్వ పరీక్షల్లో విఫలమయ్యారని అక్కా చెల్లెళ్ల గెంటివేత.. ఎక్కడంటే..?
Jaat Panchayat
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 10, 2021 | 2:35 PM

Jaat Panchayat: ఆధునిక ప్రపంచం అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. సైన్స్ దినదినాభివృద్ధి జరుగుతోంది. ఈ క్రమంలో కూడా అనుమానాలు, అపోహలు, కట్టుబాట్లు మనుషులను మృగాల్లా మారుస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. కన్యత్వ పరీక్షలో విఫలమైందని భార్యను ఇంటినుంచి గెంటేశాడు ఓ భర్త. ఆమే కాకుండా.. ఆమె సోదరిని కూడా అత్తా మామలు పుట్టింటికి పంపేశారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో జరిగింది.

కంచర్భట్‌ తెగకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు గతేడాది నవంబర్‌లో బెల్గాంలోని ఇద్దరు అన్నదమ్ములతో వివాహమైంది. కంజర్భట్‌ తెగ ఆచారం ప్రకారం.. పెళ్లైన వెంటనే కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఓ యువతి విఫలమైంది. దీంతో భర్త, అత్తింటి వారు ఆమెను వేధించడం మొదలు పెట్టారు. అనంతరం ఇంటినుంచి గెంటివేశారు. ఈ క్రమంలో యువతల తల్లిదండ్రులు ఫిబ్రవరిలో కుల పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అప్పుడు ఇద్దరి అక్కాచెల్లెళ్లకు భర్తల నుంచి విడాకులిస్తున్నట్లు కులపెద్దలు తీర్పును ప్రకటించారు.

దీంతో ఆ మహిళలిద్దరూ కలిసి స్థానిక రాజారామ్‌పురి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతోపాటు ఈ తీర్పును ప్రకటించినందుకు కుల పెద్దలు కొంత నగదును సైతం తీసుకున్నారని మహిళల కుటుంబసభ్యులు వెల్లడించారు.

Also Read: