18 సంవత్సరాలు దాటితే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.. మత మార్పిడిలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు

భారత్‌లో 18 ఏళ్లు నిండిన ఏ వ్యక్తి అయినా.. తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని, అనుసరించవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. బలవంతపు మతమార్పిళ్లను, చేతబడి వంటి తాంత్రిక విద్యను...

18 సంవత్సరాలు దాటితే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.. మత మార్పిడిలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు
Supreme Court
Follow us

|

Updated on: Apr 10, 2021 | 2:27 PM

భారత్‌లో 18 ఏళ్లు నిండిన ఏ వ్యక్తి అయినా.. తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని, అనుసరించవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. బలవంతపు మతమార్పిళ్లను, చేతబడి వంటి తాంత్రిక విద్యను కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ స్పష్టతనిచ్చింది. జస్టిస్‌లు ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, బీఆర్‌ గవాయి, హృషికేష్‌ రాయ్‌తో కూడిన బెంచ్‌ దీనిపై విచారణ చేపట్టింది. ఇలాంటి పిటిషన్‌ను దాఖలు చేసినందుకు న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌, ఆయన తరపున వాదనలు వినిపించిన న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణపై ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆర్టికల్‌ 32 ప్రకారం ఇది ఏ రకమైన పిటిషన్‌? ఇలాంటి పిటిషన్‌ను దాఖలు చేసినందుకు మీపై భారీ జరిమానా విధిస్తాం’ అని గోపాల్‌ శంకరనారాయణను ఉద్దేశిస్తూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. 18 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించకూడదా..?అంటూ ప్రశ్నించింది. ఇందుకు ఎలాంటి కారణం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి అనుమతినివ్వాలని న్యాయవాది కోర్టును కోరారు. దీనికి న్యాయస్థానం నిరాకరిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

కాగా, బలవంతపు మతమార్పిడులు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14,21,25 కింద నేరం. బలవంతపు మతమార్పిళ్లను, తాంత్రిక విద్యలను కట్టడి చేయడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అశ్వినీ ఉపాధ్యాయ్‌ కోర్టులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. మతమార్పిడులతో మత సామరస్యాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, అందుకు ఒక కమిటీని నియమించాలని కోరారు. ఈ మేరకు ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

ఇవీ

West Bengal Elections: ఎన్నికల వేళ బయటపడ్డ 200 బాంబులు.. నిర్వీర్యం చేసిన పోలీసులు.. ముగ్గురు అరెస్టు

Coronavirus: ఇండో-టిబెట్‌ సరిహద్దు భద్రతా దళ శిక్షణా కేంద్రంలోని 11 మంది సైనికులకు కరోనా పాజిటివ్‌

Viral: ఇదేం విచిత్రం.! మూడు వారాల గర్భవతి మళ్లీ గర్భం దాల్చింది.. నోరెళ్లబెడుతున్న ప్రజలు..